వామ్మో.. మెట్రో రైలు డ్రైవర్ ఇలా చేశాడేంటి?

praveen
చిన్న సమస్యలకే మనస్తాపం చెందుతున్న జనాలు నేటి రోజుల్లో ఆత్మహత్యలు ఒక్కటే మార్గం అని అనుకుంటున్నారు. దీంతో ఏ సమస్య వచ్చినా చివరికి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో తరచూ ఆత్మ హత్యలకు సంబంధించిన ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజం తీరు రానున్న రోజుల్లో ఎటు పోతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది అని చెప్పాలి.

 ఎందుకంటే చిన్న కారణాలకే ఇక జీవితం అక్కడితో ముగిసిపోయింది అని భావిస్తూ బలవన్మరణం ఒకటే దారి అని అనుకుంటూ సమస్యను ధైర్యంగా నిలబడి ఎదుర్కోకుండా పిరికివాళ్ళలా చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యలు కారణంగా ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగి పోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మెట్రో రైలు డ్రైవర్ గా పని చేస్తూ ఉన్నాడు. ఇక మంచి జీవితం అందుకుంటూ ఉన్నాడు. కానీ ఆదాయానికి మించిన అప్పులు చేయడంతో చివరికి అతనికి మనశ్శాంతి కరువయ్యింది  అప్పులు ఇచ్చిన వారి దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో మనస్తాపం చెందాడు.

 చివరికి బలవన్మరణాలకు పాల్పడ్డాడు సదరు వ్యక్తి. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చింది. గోల్నాక లో నివసించే తుంకి ప్రేమ్ రాజ్ కుమారుడు సందీప్ రాజ్ అనే 25 ఏళ్ల యువకుడు నాగోల్ లో మెట్రో రైల్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతని కుటుంబం అప్పులబాధతో సతమతమవుతోంది. ఇకపోతే తల్లికి ఫోన్ చేసినా సందీప్ తాను ఈరోజు మియాపూర్ డిపో లో నిద్రిస్తాను ఇంటికి రాను అంటూ చెప్పాడు. కానీ ఇక మరునాడు ఉదయమే ఇబ్రహీంపట్నం చెరువు లో సందీప్ రాజ్ మృతదేహం కనిపించింది. దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితుడు వెంకటేష్ వాట్సాప్ మెసేజ్ చేసినట్టు గుర్తించారు పోలీసులు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: