రోడ్డు ప్రమాదంలో గాయాలు.. అలాగే రాస్తారోకో.. చివరికి?

praveen
నేటి రోజుల్లో సాటి మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వని అదే మనుషులు అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  సాధారణంగా రోడ్డు ప్రమాదం బారిన పడిన తర్వాత  ప్రమాదంలో గాయాల బారిన పడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఇదే చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించకపోతే ఏకంగా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మాత్రం ఇలా చేయలేదు ఏకంగా రోడ్డు ప్రమాదం బారిన పడిన వ్యక్తిని రోడ్డు పై మంచం మీద పడుకోబెట్టి నిరసన చేయడం మొదలుపెట్టారు.

 చివరికి ఈ అనాలోచిత పని కారణంగా ఇప్పటికే తీవ్ర గాయాలపాలైన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిజాంబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మండే ఎండల్లో మంచంపై పడుకోబెట్టి క్షతగాత్రుడితో రహదారిపై రాస్తారోకో చేయడంతో అనారోగ్యం కారణంగా పరిస్థితి విషమించి మృతి చెందాడు సదరు యువకుడు. కమ్మర్ పల్లి కి చెందిన భూమన అనే 33 ఏళ్ల వ్యక్తి తన స్నేహితుడు ఆటోడ్రైవర్ మారుతి తో కలిసి ఆటోలో ఊరికి బయల్దేరాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఇక ఈ ప్రమాదంలో భూమన్న వెన్నెముకకు తీవ్రంగా గాయమైంది.

 అయితే భూమన్న తల్లి గంగవ్వ  ఆటో డ్రైవర్ మారుతి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గాయం కారణంగా మంచంపై లేవలేని స్థితిలో ఉన్న భూమన్నను ఆటోడ్రైవర్ మారుతి ఆదుకోవాలని ఆర్థిక సహాయం చేయాలని భూమన్న కుటుంబ సభ్యులు నిజాంబాద్ కరీంనగర్ ప్రధాన రహదారిపై  రాస్తారోకో చేశారు. ఇక గంటలపాటు అలాగే ఎండలో క్షతగాత్రుడిని అలాగే ఉంచారు. తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి క్షతగాత్రుడిని  108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా  చివరికి మార్గ మధ్యంలోనే మృతి చెందాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: