సినిమా రేంజ్ దొంగతనం.. ట్రైన్ లోకి ఎలా చొరబడ్డారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా దొంగలు అంటే అందరికీ గుర్తొచ్చేది రాత్రి సమయంలో అందరూ నిద్రపోయాక ఇంట్లోకి ప్రవేశించటం.. ఇంట్లో బీరువా నగలు ఎక్కడ ఉన్నాయి అని వెతికి వాటిని బద్దలుకొట్టి లోపల ఉన్న బంగారు ఆభరణాలను నగదును ఎత్తుకెళ్లటం.. ఇలా దొంగలు అని పేరు చెప్పగానే అందరికీ ఇదే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసిన సినిమాల్లో ఇలాంటివి ఎక్కువగా చూపించారు కాబట్టి. కానీ నేటి రోజుల్లో మాత్రం దొంగలు తమ రూటు మార్చుకున్నారు. జనాల్ని బురిడీ కొట్టించెందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కొత్తగా ప్లాన్ లు వేస్టు ఉన్నారు.

 దీంతో ఇక ఇలా దొంగలను పట్టుకోవడం అటు పోలీసులకు మాత్రం పెద్ద సవాలు గా మారిపోయింది అని చెప్పాలి. అంతేకాదు సినిమాల్లో చూపించినట్లుగా అటు ట్రైన్లలో కూడా ఇటీవలి కాలంలో దొంగల బెడద పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా సినిమాల్లో అయితే ముందుగా మంచి వాళ్ళులా పరిచయం పెంచుకొని మత్తు మందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి.. మత్తులోకి జారుకున్న తర్వాత మొత్తం కాజేయడం లాంటివి చేస్తూ ఉంటారు. నిజ జీవితంలో కూడా ఇలాంటి వారు లేకపోలేదు అని చెప్పాలి. ఇంతకీ ఇప్పుడు ట్రైన్ దొంగల గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.

ఇటీవలే తిరుపతి నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న ఒక ఎక్స్ప్రెస్ రైల్లో నిన్న దోపిడీ జరిగింది. ఈ ఘటన కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు సిగ్నల్ తీగలను కత్తిరించారు. దీంతో ఊర్లో రైలు నిలిచిపోయింది. దీంతో దుండగులు వెంటనే భోగి లోకి చొరబడి మారణాయుధాలు చూపించి ప్రయాణికుల వద్ద ఉన్న నగలు నగదు దోచుకు పోయారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఏకంగా ఆరు తులాల బంగారు నగలు దొంగలు దోపిడీ చేశారు అన్న విషయం తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: