వామ్మో.. వీడి తెలివికి పోలీసులే అవాక్కయ్యారుగా..!

Satvika
దొంగలు పోలీసులను బురిడీ కొట్టించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. సొమ్మును దాచి పెట్టడానికి భారీ ప్లాన్స్ వేస్తున్నారు. అమాయికంగా కనిపిస్తూ ఇంటర్నేషనల్ తెలివిని ప్రదర్షిస్తూన్నారు. ఒకవైపు ఇంట్లో పని చేస్తున్నట్లు చేస్తూనే మరో వైపు చేతికి పని చెబుతున్నారు. అందుకే ఇంటికి ఎవరొచ్చినా నమ్మడంవల్ల మనం నట్టేట్లో మునిగిపొథాము.. ఎవరైనా వస్తే అందుకే ఒక కంట కనిపెట్టాలి. లేకుంటే క్షణాల్లో అన్నీటిని మాయం చేస్తారు. ఎవరూ ఎలాంటి వాళ్ళు అన్నది ఎవరూ కనిపెట్టలేరు. ఇది చాలా కష్టమైన పని అని అంటారు.


పోలీసులకు టార్గెట్ ఇస్తున్నారు దొంగలు. వాళ్ళు చేస్తున్న జిమ్మిక్కుల కు ఒక్కోసారి పోలీసులు షాక్ అవుతున్నారు.. అలాంటి షాకింగ్ ఘటన తాజాగా ఒకటి వెలుగు లోకి వచ్చింది.. ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అతను వృత్తి రీత్యా ఎలక్త్రిషన్.. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు దొంగతనాలు చెస్తున్నారు. అతను పని చేస్తున్న ఇళ్లల్లో ఉదయం అన్నీ గమనిస్తారు. రాత్రి వచ్చి దొరికినంత దొచుకున్నాడు. వాటిని ఎవరికీ అనుమానం రాకుండా అతని బల్బ్ తెలివి తో దాచి పెట్టేవాడు. చివరికి పోలీసులు కనిపెట్టడం తో అతని తెలివి బయట పడింది.


వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ , విషాఖ లో వెలుగు చూసింది. చుట్టుపక్కల ఇళ్లల్లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక్క ఫోన్‌ కొడితే చాలు.. వెంటనే క్షణాల్లో వాలిపోతాడు. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. దాంతో పాటే.. తనకున్న మరో ప్రవృత్తి ని కూడా అక్కడే ఇంప్లిమెంట్‌ చేస్తాడు. అతను పని చేసిన ఇంట్లో దొరికిన నగలను డబ్బులను దొంగలించి దాచి పెట్టేవాడు. దొంగిలించిన వస్తువులను స్విచ్ బోర్డులు, కరెంట్ మీటర్ల లో భద్రంగా దాస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు తో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని దొంగతనం గురించి బయట పెట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: