కిలాడీ లేడీ ఆటలకు చెక్ పెట్టిన పోలీసులు..చివరికి..

Satvika
డబ్బుల కోసం మహిళలు ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు.. డబ్బు ఆశ చూపించి ఎందరినొ దారుణంగా మోసం చెస్తున్నారు. కొందరు ఛీటిల పేరుతో డబ్బులను తీసుకొని చివరికి బోర్డు తిప్పెస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు నిరుద్యొగులను టార్గెట్ చేస్తూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులను తీసుకొని చివరికి అడ్రెస్ మారుస్తున్నారు. తాజాగా ఓ లేడీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చివరికి బోర్డు తిప్పెసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని బయట పెట్టారు..


ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూస్తున్నాయి.. విజయవాడ, నెల్లూరు, ఒంగోలు వంటి  ప్రాంతాల్లొ కొందరు మహిళలు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుండీ లక్షల రూపాయలు వసూలు చేసింది ఓ కిలాడీ.. రైల్వే, పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ, డీఆర్డీఏ, జ్యూడీషియల్.. ఇలా ఎలాంటి శాఖలోనైనా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసానికి పాల్పడుతు వస్తుంది.డీఆర్డీఏలో ఉన్నత స్ధాయి అధికారిగా ఉన్నానని నిరుద్యోగులను నమ్మించింది. అలా వారు నమ్మగానె లక్షలకు లక్షలు వారి దగ్గర నుంచి కొట్టేసింది.


రాష్ట్రంలోని శ్రీకాకుళం టెక్కలి కి చెందిన ఓ మహిళ ఈ ఘరానా మోసం చేసెందుకు రెడీ అయ్యింది.. ప్రభుత్వ శాఖల లో జాబ్ లు ఇప్పిస్తానని చెప్పింది.బాగా దండుకున్న తరువాత ప్లేట్ ఫిరాయించింది... డబ్బులు ఇచ్చి కొన్నెల్లు అయిన కూడా ఉద్యొగాలకు సంబంధించిన అప్డేట్స్ రాకపోవడంతో అందరూ ఆందొలనకు దిగారు. మోసపొయామని తెలుసుకున్నారు. దాంతో నేడు బాధితులు అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన మండపాక నిర్మల అనే మహిళ భారీ మోసాలకు పాల్పడింది. ఆమె ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రెస్ చేసి అసలు విషయాన్ని తెలుసుకున్నారు.. ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: