భర్తను పంచుకున్న భార్యలు.. కథ ఏంటంటే?

Satvika
ఏది అయినా కూడా మరో మహిల తో పంచుకోవడం చేస్తారు..కానీ కట్టుకున్న భర్త విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదెలే.ఎందుకంటే తన భర్త తనకే సొంతం అని చాలా మంది మహిళలు అనుకున్నారు. అందుకే వేరే మహిళ తో భర్త మాట్లాడటం చూస్తె మాత్రం తట్టుకోలేరు.అవి సినిమాలకు మాత్రమే బాగుంటుందనే విషయం తెలిసిందే. నిజ జీవితంలో మాత్రం ఇలాంటి ఘటనలు వెలుగులొకి వచ్చింది..ఓ మహిళ భర్తను  ప్రియురాలికి ఇచ్చి పెళ్ళి చెయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.. ఈ విషయాన్ని చూస్తె శోభన బాబూ నటించిన ఏమండీ ఆవిడ వచ్చింది.. సినిమా గుర్తుకు వస్తుంది కదా.. అవును అండీ అక్షరాల ఆ సినిమా స్టోరీ రియల్ లైఫ్ లో జరిగింది.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.. ఇది విన్న ప్రతి ఒక్కరూ కూడా నోర్లు వెల్ల బెట్టేలా చెస్తుంది. వివరాల్లొకి వెళితే.. ఉత్తరం ప్రదేశ్ లో వెలుగు చూసింది.అక్కడ ఓ వ్యక్తి మొదటి భార్య అనుమతితోనే రెండో వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం అతడిని ఇద్దరు భార్యలు సమంగా పంచుకున్నారు. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.. విషయాన్నికొస్తే..రామ్‌పూర్ జిల్లాలోని ధోక్‌పురి తండా ప్రాంతానికి చెందిన వివాహితుడైన ఓ వ్యక్తికి కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఉద్యోగ నిమిత్తం ఛండీగఢ్ వెళ్తున్నానని భార్యకు చెప్పి ఆ యువతితో అక్కడ సహజీవనం చేశాడు. దాంతో ఆ యువతి గర్భం దాల్చింది. ఇక ఎలాగైనా అతను వదిలించుకొవాలని అనుకున్నాడు. తప్పించుకునేందుకు అక్కడి నుంచి పరారై స్వగ్రామానికి పారిపోయాడు. అతను మోసం చేశాడని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.అనంతరం ఆ యువతి అతని దగ్గరకు వెళ్ళింది. అక్కడ అతన్ని పట్టుకొని నిలదీసింది.. పెద్ద గొడవ అయ్యింది. యువతిని వివాహం చేసుకునేందుకు నిందితుడి మొదటి భార్య అంగీకరించాల్సి వచ్చింది. ఇద్దరూ భార్యలతోనూ అతను ఆ గ్రామంలోనే కాపురం పెట్టాడు. ఈ క్రమంలో అతడిని ఇద్దరు భార్యలూ పంచుకున్నారు. మొదటి మూడు రోజులు మొదటి భార్య తో, తర్వాత మూడు రోజులు రెండో భార్యతో, ఆదివారం తల్లి దండ్రుల తో ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: