ఎఫైర్.. ఒకే గదిలో ముగ్గురు.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో జరుగుతున్న దాడులను ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా వివాహేతర సంబంధం పెట్టుకోవడం తప్పు అని తెలిసినప్పటికీ ఎంతో మంది పరాయి వ్యక్తులతో మోజులో పడి చివరికి కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నావు.  ఇక మరో వైపు  కట్టుకున్న వారిని మోసం చేస్తూ  రాసలీలల్లో మునిగి తేలుతున్న సమయంలో అసలు విషయం తెలిసి ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటన లు కూడా అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.

 ఇలా ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని పరిణామాలకు దారి తీస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ వివాహేతర సంబంధం ఒక వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది.  నందిగామ పట్టణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే తెల్లవారుజామున  ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తికి ఉషా కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ ఉన్నారు.. ఈ క్రమంలోనే ఇటీవల నందిగామ లోని ఒక గ్రామంలో పని చేసేందుకు వచ్చారు ఇద్దరు.

 ఈ క్రమం లోనే ఉషకు అప్పాజీ అనే వ్యక్తితో కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది.. ఇక ప్రస్తుతం ముగ్గురు కలిసి ఒకే గది లో ఉంటున్నారు. ఇటీవలి కాలం లో ఉష అప్పాజీ తో కూడా ఎంతో చనువు గా ఉంటుంది. అయితే ఇది నచ్చని విజయ్ తీరు మార్చుకోవాలి అంటూ  హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె మాత్రం వినకపోవడం తో చివరికి అప్పాజీ గొంతును కత్తితో  దారుణం గా కోసి హత మార్చాడు. అడ్డొచ్చిన ప్రియురాలికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: