హైదరాబాద్ రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు.. పోలీసులు ఏం చేశారు అంటే?

praveen
ఇటీవల కాలంలో రహదారులు కాస్త ఖాళీగా కనిపించాయి అంటే చాలు ఇక ఊహించని రీతిలో స్టంట్స్  చేయడం మిగతా వాహనదారులను భయ పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎంతోమంది. రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న వారిపై అటు పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడ ఆకతాయిల ఆగడాలు మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ నగరంలో.  మనం కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటాం షేర్ ఆటో ల తో కొన్ని స్టంట్స్ చేస్తూ ఉంటారు.  ఇలాంటివి టీవీలో చూస్తున్నప్పుడు అందరికీ భయం వేస్తూ ఉంటుంది. ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని వణికిపోతూ  ఉంటారు.

 కానీ ఇక్కడ మాత్రం ఏకంగా రహదారులపై ఆటోలతో ఇలాంటి స్టంట్స్ చేశారు. ఒక ఆటో కాదు ఏకంగా మూడు ఆటోలతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఇతర వాహనదారులను భయాందోళనకు గురి చేశారు ఇక్కడ కొంతమంది ఆకతాయిలు. ఆటోలను సవ్యంగా నడపకుండా ఒకేవైపు వంచి కేవలం రెండు టైర్ల మీదే నడుపుతూ రోడ్డుపై నానా హంగామా సృష్టించారు. ఈ ఘటన హైదరాబాద్లోనే చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిదిలో వెలుగు లోకి వచ్చింది. పలు ఆటోలు ఇటీవలే అర్ధరాత్రి సమయంలో డ్రాగ్ రేస్ లో పాల్గొన్నాయి అన్నది తెలుస్తుంది. నగరంలోని సౌత్ జోన్ సంతోష్ నగర్ పిసల్ బండ క్రాస్రోడ్ నుంచి చంద్రయన్గుట్ట క్రాస్ రోడ్డు వరకు ఈ డ్రాగ్ రేస్ జరిగిందని పోలీసులు గుర్తించారు.

 ఇక ఈ రేస్  సమయంలో బెట్టింగులు కూడా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు కొంతమంది వ్యక్తులు.  ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  అయితే పోలీసులు ఆకాతాయిల కోసం వెతకడం ప్రారంభించారు. డ్రాగా రేస్  ఈ వీడియో తీసి ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రమాదకర విన్యాసాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా రెండు ఆటోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ యువకులు ఆటోలను అద్దెకు తీసుకుని నడుపుతున్నారని ఇటీవల డ్రాగ్ రేస్ లో పాల్గొన్నారు అంటూ పోలీసు విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: