కొడుకు చిత్ర హింసలు పెట్టినా తల్లి ప్రేమను చాటుకున్న మహిళ..!

Satvika
కన్న తల్లి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం లేదు.. అమ్మ అంటే భూదెవి అని అర్థం.. పిల్లలను తొమ్మిది నెలలు మోసి కనడం మాత్రం కాదు..బయటకు వచ్చిన తర్వాత కంట్లో నలక పడిన కూడా తట్టుకోలేదు. అయితే ఈరోజుల్లో చాలా మంది డబ్బు మీద పిచ్చితో తల్లి దండ్రులను పూర్తిగా పక్కన పెట్టారు. అందుకే హొల్దెజ్ హోమ్ లు పెరుగుతూన్నాయని అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మంది పిల్లలకు దూరంగా ఉంటున్నారు. కొందరు భార్య కోరిక మేరకు తల్లి దండ్రులను దూరం పెడితే, మరి కొందరు మాత్రం ఆస్తులు కోసం వారిని వదిలెస్తున్నారు. ఈరోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా జరిగిన ఒక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఆస్తి ఇవ్వలేదని తల్లిని అతి దారునంగా కొడుకు తల్లిని కొట్టారు.. అంతేకాదు కాలితో తన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో లు తీసి కొందరు స్థానికుల సచివాలయం ఉద్యోగులకు పంపించారు. అందుకే ఈ ఘటన కలకలం రేపుతోంది.. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లొకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లి బ్రహ్మానందపురంలో తల్లి పట్ల కసాయి కొడుకు దాష్టీకం అని చెప్పాలి.


ఈ విషయం సభ్య సమాజాన్ని తల దించుకొనెల చెస్తుంది. యావత్ తల్లులను కంటతడి పడేలా చెస్తుంది.కని, పెంచిన సంగతి కూడా మర్చిపోయి కడుపు మీద కాలితో తన్నాడు.కాలితో తన్నినా ఆ వృద్ధురాలు మాత్రం తల్లి ప్రేమను చాటుకుంది. తన కొడుకు కోడలిని ఏమి అనవద్దు, వారిపై ఎలాంటి కేసులు పెట్టవద్దని పోలీసులు, అధికారులను కోరింది.  ఘటనపై వృద్ధురాలి కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్ వాసిరెడ్డి వెల్లడించారు.. కొడుకుల పట్ల తల్లిదండ్రులు జాలి చూపించినా కూడా,. వృద్ధులను భాధ పెట్టిన వారిపట్ల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇది వేరే వాళ్ళకు గుణ పాఠం కావాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: