తల్లి, కొడుకులు కలిసి కూతురు తల నరికి సెల్ఫీ దిగారు.. చివరికి..!

MOHAN BABU
పరువు హత్య కేసులో తన సోదరిని పొట్టనబెట్టుకున్న 17 ఏళ్ల బాలుడిని, అతని తల్లిని మహారాష్ట్ర పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రాథమిక  నివేదికల ప్రకారం, బాలుడు తన తల్లి సహాయంతో మొదట తన 19 ఏళ్ల సోదరి కీర్తి థోర్‌ను నరికివేసి, ఆపై ఆమె తలను పొరుగువారి ఇంటి  ముందు పడేశాడు. ఈ సంఘటన ఔరంగాబాద్‌లోని వైజాపూర్ తహసీల్‌లోని గోయ్‌గావ్ గ్రామంలో  జరిగింది. 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరియు అతని తల్లిని అరెస్టు చేశారు. ప్రస్తుతం చుట్టుపక్కల వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కీర్తి తల నరికిన తర్వాత, నిందితుడైన బాలుడు మరియు అతని తల్లి కూడా కత్తిరించిన తలతో సెల్ఫీలు తీసుకున్నారు.
కీర్తి  కాలేజీ స్నేహితుడిని ప్రేమించింది.  పెళ్లి కూడా చేసుకుంది. దీంతో విషయం  తెలుసుకున్న  సోదరుడు-తల్లి  అసంతృప్తి చెందారు. అన్నీ మరిచిపోయి పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పి నాటకం ఆడారు.  తల్లీకొడుకులిద్దరూ కూతురు ఇంటికి  వెళ్లారు. కీర్తి టీ సిద్ధం చేయడానికి వంటగదిలోకి వెళ్లినప్పుడు, ఆమె సోదరుడు తన సోదరి తల నరికాడు. ఔరంగాబాద్ డీవైఎస్పీ కైలాష్ ప్రజాపతి మాట్లాడుతూ బాధితురాలి తల్లి, ఆమె సోదరుడు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఆమెను కలవడానికి వచ్చారు. బాధితురాలు వంటగదిలో ఉన్నప్పుడు, ఆమె తల్లి ఆమెను కాళ్ళను గట్టిగా పట్టుకుంది మరియు ఆమె సోదరుడు బాధితురాలి తల నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించామనీ డివైఎస్పీ తెలిపారు.

 మృతురాలి భర్త కూడా అక్కడే ఉన్నాడు. ప్రధాన నిందితుడైన 17 ఏళ్ల యువకుడు తన బావను చంపడానికి ప్రయత్నించాడు, అతను ఎలాగో తప్పించుకోగలిగాడు.
నిందితుడు ప్రసిద్ధ మరాఠీ చిత్రం సైరత్  సినిమా చూసి ఈ హత్య చేశారని తెలుస్తోంది.  ఇందులో బాలిక కుటుంబం ఆమె ఇంటికి వెళ్లి ఆమెను చంపేశారని పోలీసు అధికారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: