వ‌రంగ‌ల్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..! ఎంత మంది అరెస్ట‌య్యారంటే..?

N ANJANEYULU
తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో గ‌త కొద్ది రోజుల నుంచి డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం త‌రుచూ వెలుగులోకి వ‌స్తుంది. తాజాగా వరంగల్‌లో విద్యార్థులు, యువకులకు డ్రగ్స్ విక్రయిస్తున్న పలువురు వ్యక్తులను  అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్ప‌టివ‌ర‌కు  వ‌రంగ‌ల్‌లో మొత్తం ఆరుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసార‌ని వెల్ల‌డించారు. వారిలో న‌గ‌రంలోని పిన్న‌వారి వీధికి చెందిన శివ్వ‌రోహ‌న్‌, హైద‌రాబాద్ మాదాపూర్‌కు చెందిన పెంచిక‌ల కాశీరావుతో పాటు డ్ర‌గ్స్ కొనుగోలు చేసిన మ‌రో న‌లుగురు వ్య‌క్తులున్నారు.
నిందితుల వ‌ద్ద నుంచి గ్రామున్నర కొకైన్, 15 గ్రాముల చరస్‌, 36 ఎల్ఎస్‌డీ పేపర్లు, మత్తు కలిగించే మాత్రలు, గంజాయి నుంచి తీసిన నూనె, గంజాయిని పొడిచేసే పరికరం, హుక్కా సామాగ్రి, ఆరు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీట‌న్నింటి  విలువ మొత్తం రూ. రూ.3.16 లక్షల వరకు ఉంటుందని వెల్ల‌డించారు పోలీసులు.
నిందితుల‌లో ఒక‌రైన  రోహన్ ఇంజినీరింగ్ విద్యార్థి. విద్యార్థి ద‌శ నుంచే డ్రగ్స్‌కు అలవాటు పడిన రోహన్ ఆ తర్వాత వాటిని సరఫరా చేయడం కూడ‌ మొదలుపెట్టాడు. అదేవిధంగా గోవా వెళ్లి నైజీరియాకు చెందిన జాక్, కాల్‌జోఫర్‌ల నుంచి కొకైన్, చరస్‌తోపాటు ఇతర మత్తుపదార్థాలను కొనుగోలు చేసి తీసుకొచ్చేవాడు. వాటిని స్నేహితులతో కలిసి వరంగల్‌లో విక్రయించేవాడని పోలీసులు తెలిపారు.
హైద‌రాబాద్‌లోని మాదాపూర్ కు చెందిన మ‌రో నిందితుడు కాశీరావు ఓ ప్ర‌యివేటు సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అత‌డు అప్పుడ‌ప్పుడు గోవాకు వెళ్లి అక్క‌డ మ‌త్తు ప‌ద‌ర్థాలు కొనుగోలు చేసేవాడు. వీరిద్ద‌రికీ ఏర్ప‌డిన ప‌రిచయంతో ఈ దందాను కొన‌సాగిస్తున్నారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఉన్న లాడ్జ్‌ల‌లో త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగించేవారు. వీరి డ్ర‌గ్స్ దందాపై స‌మాచారం తెలుసుకున్న పోలీసులు సుబేదారి, టాస్క్‌ఫోర్స్ న‌క్క‌ల‌గుట్ట‌లో ఉన్న లాడ్జీపై దాడులు నిర్వ‌హించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించ‌గా అస‌లు విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇటీవ‌ల రాష్ట్రంలో డ్ర‌గ్స్ నిర్మూలించాల‌ని సీఎం కేసీఆర్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన విష‌యం విధిత‌మే. అప్ప‌టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు దాడులు కొన‌సాగించి నిందితుల‌ను అరెస్ట్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: