దారుణం : జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే?

praveen
రోజురోజుకు దేశంలో ఆడపిల్ల జీవితం దుర్భరంగా మారిపోతుంది. కామంతో కళ్లు మూసుకుపోతున్న మృగాలు సభ్యసమాజంలో ఎక్కువ అవుతున్న తరుణంలో ఆడపిల్ల రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా..  అత్యాచారాలు  మాత్రం ఎక్కడా ఆగడంలేదు. చట్టంలోని లొసుగులను  అటు ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న వారికి చుట్టాలుగా మారిపోతున్నాయి. దీంతో అత్యాచారానికి పాల్పడినప్పటికీ శిక్ష   నుంచి తప్పించుకుంటూ దర్జాగా తిరుగుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  దీంతో ఆడపిల్లలపై అత్యాచారం చేస్తే శిక్షలు పడతాయని భయం ఎవరిలో కనిపించడం లేదు.

 దీంతో రోజు రోజుకి ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో ఊగిపోయి మానవమృగాలు మీద పడిపోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆడపిల్ల ఇల్లు దాటి కాలు బయట పెట్టాలి అంటేనే భయ పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  పసికందుల నుంచి పండు ముసలి వరకు ఎంతోమంది కామాంధుల కోరల్లో చిక్కుకుని బలవుతూనే ఉన్నారు. కొంత మంది కామాంధులు అత్యాచారం చేసి అంతటితో ఆగకుండా దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.

 అనంతపురం జిల్లా లో అభం శుభం తెలియని చిన్నారి పై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే 9 ఏళ్ల చిన్నారి తీవ్రమైన జ్వరం రావడం తో తల్లి దండ్రులు స్థానికం గా ఉన్న కొత్త చెరువు లోని ఆర్ఎంపీ ఆదినారాయణ నిర్వహిస్తున్న శిరిడి సాయి క్లినిక్ కి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆర్ఎంపి ఆదినారాయణ కు సహాయకుడిగా పని చేస్తున్నాడు జయరాం అనే వ్యక్తి. ఈ క్రమంలోనే ఇక బాలికకు ఇంజక్షన్ ఇవ్వాలి అని చెప్పి మాయ మాటలతో నమ్మించి బాలిక తల్లిని బయటకు పంపించేశాడు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇక చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: