కామపు సమాజం.. ఈ లోకంలో ఎందుకు పుట్టావ్ తల్లి?

praveen
మగువ..  అసలు ఈ లోకంలో నువ్వు ఎందుకు పెట్టావు..  పుట్టకపోయినా బాగుండేదేమో..  ఈ మానవ మృగాల కోరల్లో చిక్కుకుని మరి అయ్యే దానికి కాదు ..  పాడు సమాజం లో ఎక్కడ నీకు రక్షణ..  అందరినీ బాగా చూసుకునే ఆ దేవుడు అటు నిన్ను మాత్రం చిన్నచూపే చూస్తున్నాడు. అందుకే రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయి. దేవుడికి కూడా నువ్వు చులకన అయిపోయావ్ తల్లి..  అందుకే అత్యాచారాలకు పాల్పడి నేరాలు చేసిన వాళ్లు దర్జాగా సభ్యసమాజంలో తిరుగుతుంటే..  అభం శుభం తెలియని నీవు మాత్రం ముఖం దాచుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  సమాజం మొత్తం నాగరికత వైపు అడుగులు వేస్తోంది అని అందరూ గొప్పలు చెబుతున్నారు..  నాగరికత వెంటే కాస్త మానవత్వం కూడా పెరిగితే  బాగుండేది అని నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అర్ధం అవుతుంది.

 ఓ మగువా నీకు అసలు ఎక్కడ రక్షణ ఉంది..  ఇంటి నుంచి కాలు బయట పెడితే ఆకతాయి నుంచి.. కాలేజీకి వెళ్తే తోటి విద్యార్థుల నుంచి..  బాగా చదువుకుంటే ఉపాధ్యాయుల నుంచి..  అన్ని బాధలను గుండెల్లో దాచుకొని భారంగానే బ్రతుకును గడుపుతుంటే అటు సొంత వాళ్ల నుంచి కూడా అనుక్షణం లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ మగువా నీకు ఎక్కడ ఉంది ఇంకా రక్షణ. కష్టం రాకుండా చూసుకోవాల్సిన నాన్నే కామ కళ్ళతో చూస్తుంటే..  ఎంతో ప్రేమగా దగ్గర తీసుకో వలసిన బాబాయి అసభ్యంగా తాకుతుంటే..  ఆపదలో అండగా ఉండాల్సిన అన్నే కోరిక తీర్చామంటే.. ఓ మగువా ఎక్కడ ఉంది నీకు రక్షణ.

 సృష్టికి మూలమైన నీకు..  ఈ పాడు లోకం లో అసలు రక్షణ లేకుండా పోయింది. రోజురోజుకు ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అమ్మ నాన్న లేని ఆ యువతిని ప్రేమగా చేరదీయాల్సిన బాబాయ్ కామం తో ఊగిపోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  బాబాయ్ అత్యాచారానికి పాల్పడడంతో తట్టుకోలేకపోయిన 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నేరేడుచర్ల మండలానికి చెందిన అక్కచెల్లెళ్ల తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. దీంతో ఇక పెదనాన చేరదీసి వాళ్ళ బాగోగులు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పెదనాన్న ఎంతో బాధ్యతగా ఆ యువతిని వివాహం కూడా చేశాడు. ఇక ఇటీవలే  సొంత బాబాయ్ ఆ యువతి పై కన్నేశాడు

 రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన బాబాయ్ ని సొంత నాన్న లాగా చూసుకోవడం మొదలుపెట్టింది ఆ యువతి. కానీ అతను మాత్రం అసభ్యంగా తాకుతూ బాబాయ్ అన్న పదానికే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించాడు  కాలు విరిగిన బాబాయ్ కి సేవలు చేస్తున్న యువతి పై కన్నేసిన సదరు దుర్మార్గుడు ఏకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఇది తట్టుకోలేకపోయిన ఆ యువతి చివరికి తనువు చాలించింది. పాపం ఆ యువతికి అమ్మానాన్న ఉన్న ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: