మగ బిడ్డ కోసం భర్త చిత్రహింసలు.. 1500 ఇంజెక్షన్లు వేయించి.. ఆపై..?

MOHAN BABU
ఇంత టెక్నాలజీ వచ్చిన, సమాజం మారినా  కొంతమంది మాత్రం మారడం లేదు లింగ భేదాలు చూపించుకుంటూ మగ బిడ్డ అయితే ఎక్కువ, ఆడబిడ్డ తక్కువగా చూసే అటువంటి వివక్ష ఇంకా తగ్గడం లేదు. ప్రస్తుత కాలంలో ప్రతి వెయ్యి మంది మగాళ్ళకి 875 ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. అయినా భారతదేశంలో  ఆడ, మగ అనే లింగ భేదం తగ్గడం లేదు. అలాంటి ఒక సంఘటనలో ఈ మహిళను ఎంత చిత్రహింసలకు గురి చేశారు తెలుసుకుందాం. 1500 ఇంజెక్షన్లు, 8 అబార్షన్లు చేయించారు. ఇది కేవలం మగబిడ్డ కోసమే. మనం సాంకేతికంగా ఇంత అభివృద్ధి సాధించిన  ఇంకా కొంతమంది  మూర్ఖత్వం ఆలోచనలోనే ఉన్నారు. ఆడపిల్ల వద్దు. మగ బిడ్డ ముద్దు అనే ఆలోచనలతో కట్టుకున్నటువంటి భార్యను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే ఉన్నత విద్య చదివినటువంటి ఈ భర్త  తన యొక్క భార్య తెలియకుండానే  ఇన్నిసార్లు అబార్షన్ చేయించాడు.. అది ఎక్కడో  తెలుసుకుందాం..


 ఆడపిల్ల పుట్టిందంటే ఆ ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని  భావించి పండగలను చేసుకుంటున్నారు. అయినా కొందరు మాత్రం మరొక మూర్ఖపు ఆలోచన విడడం లేదు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారు. పూర్వకాలంలో  మహిళలంటే వెనుకబడి ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో  ఆడపిల్లలదే పై చేయి  అవుతోంది. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. వారికి  అన్ని రంగాల్లో అవకాశాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. సమాజం  ఇలా సాంకేతికంగా ముందుకు వెళ్తున్నా  కొంతమంది మాత్రం ఆడ మగ అనే తేడాలు ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ఆడపిల్లలంటేనే పిల్లలని కనిపెట్టే మిషన్లుగా  చూస్తున్నారు. కొన్నిచోట్ల  మగ పిల్లల కోసం బ్రుణ హత్యలు కూడా చేయిస్తున్నారు. ఇలాంటి ఒక ఘటన  ముంబై పట్టణంలో వెలుగులోకి వచ్చింది. ముంబై పట్టణంలోని ఉండే దాదర్ లో ఒక భర్త అరాచకాలు చూసి  చాలామంది షాక్ కు గురయ్యారు. ఒక నలభై సంవత్సరాల మహిళ తన  భర్త యొక్క  కోరిక మేరకు, ఎనిమిది సార్లు  అబార్షన్ చేయించు కోవాల్సి వచ్చింది. అది కూడా ఆమెకు కారణం ఏమిటో కూడా తెలియకుండానే, అంటే భర్త ఏ రేంజ్ లో  ఆమెను చిత్రహింసలు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళకు పెళ్లి 2017 సంవత్సరంలో జరిగింది. కొడుకు పుట్టాలని ఆలోచనతో  విదేశాల్లో ఆమెకు ఎనిమిదిసార్లు అబార్షన్ కూడా చేయించాడు అని బాధితురాలు తెలిపింది.

 ఆమె 2009వ సంవత్సరంలో  ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. 2011 వ సంవత్సరంలో ఆ బాధితురాలు మళ్లీ గర్భం దాల్చింది. అయితే ఆమెకు తెలియకుండానే భర్త ఆమెను డాక్టర్ వద్దకు తీసుకువెళ్లి  అబార్షన్ చేసుకోవాలని బలవంతం చేసి, లోపల బేబీకి ఏదో సమస్య ఉందని చెప్పి  అబార్షన్ చేయించాడట. ఈ విషయాన్ని బాధితురాలు చాలా లేట్ గా తెలుసుకున్నది. అయితే సదరు భర్త  ఫ్రీ ఇంప్లాంటేషన్  జన్యుపరమైన నిర్ధారణ కొరకు ఆ బాధితురాలిని  బ్యాంకాక్ తీసుకెళ్లాడు. అక్కడ మగ బిడ్డ కొరకు  చికిత్స కూడా చేయించాడని, దాని కొరకు  ఆమెకు దాదాపు 1500 థైరాయిడ్ హార్మోన్ సూదులు  ఇచ్చారట. ఇది బాధితురాలి అంగీకారం లేకుండానే చికిత్స చేశారని, ఇలా తనకు తెలియకుండానే  అబార్షన్ చేయించారని బాధితురాలు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: