అక్కడ టచ్ చేసిన ఆకతాయి.. యువతి చేసిన పనికి షాక్?

praveen
అర్ధరాత్రి ఆడపిల్ల నడిరోడ్డుపై ధైర్యంగా తిరిగినప్పుడే దేశానికి అసలుసిసలైన స్వాతంత్రం వచ్చింది అని గాంధీ గారు చెప్పారు. కానీ అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా ఆడపిల్ల నడిరోడ్డుపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో.  అడుగడుగునా మహిళలకు రక్షణ కరువవుతోంది. తమ కాళ్ల మీద తాము నిలబడటానికి ఎంతో మంది మహిళలు ఓ వైపు సమాజంతో పోరాడుతూనే ఉద్యోగం వ్యాపారాలలో రాణిస్తున్నారు. కానీ మనుషుల  ముసుగులు వేసుకున్న మానవ మృగాలు మాత్రం అడుగడుగున ఆడపిల్లల రక్షణ ప్రశ్నార్థకంగానే మారుస్తున్నారు. దీంతో ఎంతో మంది ఆడ పిల్లలు భయంతో ఇక ఇంటి గడప లోపలే ఉండి పోతున్నారు.

 కానీ మరికొంతమంది మాత్రం ఆడపిల్లలను ఏడిపిస్తున్న ఆకతాయిల పట్ల అపరకాళిగా మారిపోతున్నారు. ఇక తమ ఆత్మరక్షణ కోసం ఎంతో మంది మహిళలు తిరగబడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఓ యువతి ఇలాంటిదే చేసింది. తనను ఏడిపించాలని భావించిన ఆకతాయి కి చుక్కలు చూపించింది. ఇంకోసారి మరో ఆడ పిల్ల జోలికి వెళ్లకూడదు అనే రేంజిలో పనిష్మెంట్ ఇచ్చింది ఇక్కడ ఒక యువతి. ఈ ఘటన అస్సాం లో వెలుగులోకి వచ్చింది. వక్షోజాలను అసభ్యంగా తాకిన ఆకతాయికి మూడు చెరువుల నీళ్లు తాగించింది ఆ యువతి. గౌహతి కి చెందిన భావన కశ్యప్ అనే యువతి వీధిలో నుంచి నడుచుకుంటూ వెళుతోంది.

 ఈ క్రమంలోనే అటువైపుగా స్కూటీపై ఒక యువకుడు వచ్చాడు. ఇక ఆ యువతి దగ్గర ఆపి ఒక అడ్రస్ అడిగాడు. అడ్రస్ తనకు తెలియదు అంటూ యువతి చెప్పింది. ఈ క్రమంలోనే వెళ్తూవెళ్తూ ఆమె వక్షోజాలు పట్టుకున్నాడు ఆ యువకుడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయింది ఆ యువతి. ఇక అపరకాళిగా విజృంభించింది. ఏకంగా స్కూటర్ సహా ఆ యువకుడిని పక్కనే ఉన్న డ్రైనేజ్ లోకి  నెట్టింది. దీంతో ఆ డ్రైనేజీలో అతని స్కూటీ ఇరుక్కు పోయింది   అది తీయడానికి ముప్పు తిప్పలు పడ్డాడు. అంతలో గట్టిగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ యువకుడుకి దేహశుద్ధి చేశారు.  ఈ వీడియోని అంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: