శోభనం గదిలో గాలి రావడం లేదని డాబా పైకి వెళ్తా అన్న భార్య.. ఓకే అన్న భర్త.. చివరికి..?

MOHAN BABU
ఒక్కొక్కరికి ఒక్కో వింత ఆలోచన వస్తుంది. మనసులో ఒకటి పెట్టుకొని  బయటికి ఇంకో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థంకాని పరిస్థితిలో ఉంది. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. అలాంటి పెళ్లి తతంగాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు కొందరు దుర్మార్గులు. పెళ్లి కాకుండా ఉండేటువంటి కొంతమంది పెళ్లి కానీ ప్రసాదాలను ట్రాప్ చేసి ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. వివాహం అనే దానికి విలువ లేకుండా చేస్తున్నారు. వివాహమనేది  ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానమైన ఘట్టం అని చెప్పవచ్చు.

మరోరకంగా చెప్పాలంటే  మనం ఒక కొత్త జీవితానికి నాంది పలికినట్టే. ఎన్నో ఆశలతో, కలలతో జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇందులో భాగంగానే  పెళ్లి తర్వాత జరిగే కార్యం తొలి రాత్రి దంపతులను  ఇంకా దగ్గర చేస్తుందని చెప్పవచ్చు.  ఇద్దరూ  ఒకరికి ఒకరు మనసు విప్పి మాట్లాడడానికి, ఒకరితో ఒకరు కలిసి పోయి పాలల్లో నీళ్ళలా ఉండడానికి  అతని శోభనరాత్రి వేదిక అవుతుంది. కానీ ఈ జంటలో మాత్రం  శోభన రాత్రి  షాకింగ్ రాత్రిగా మారింది. ఆ వధువు, వరుడుకి కోలుకోలేని షాక్ ఇచ్చినది. అది ఏంటో తెలుసుకుందాం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బిందు అనే ప్రాంతానికి చెందిన సోను జాయిన్ కు చాలా రోజుల నుంచి  వివాహం కావడం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వడం లేదని ఆయన కతిక్ అనే వ్యక్తిని కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.  లక్ష రూపాయలు ఇస్తే  అమ్మాయిని చూసి పెడతా అని కతిక్ ఆయనకు తెలియజేశాడు .

దీంతో సోను  90 వేరు ఇవ్వడానికి  ఒప్పుకున్నాడు దీంతో అనిత రత్నాకర్ అనే యువతిని ఆమె ఒక కుటుంబాన్ని  సోను ఇంటికి తీసుకుని వచ్చాడు. అన్ని మాట్లాడుకున్నారు. బంధువుల సమక్షంలో పెళ్లి కూడా జరిగింది. వీరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 90 వేల రూపాయలు వాళ్లకు వారికి ఇచ్చేశాడు. పెళ్లి జరిగిన రోజే  రాత్రి అందరు నిద్రపోతుండగా, శోభనం గదిలో నుంచి ఉక్కపోస్తుందని  అనిత ఒంటరిగా  డాబా పైకి వెళ్ళింది. దీంతో అక్కడి నుంచి పరార్ అయింది. వీరితో పాటుగా ఆమెతో వచ్చిన వారి కుటుంబ సభ్యులు కూడా పరారయ్యారు. అప్పుడు అర్థమైంది సోను కుటుంబానికి, వారందరూ కలిసి మోసం చేశారని తెలుసుకున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: