డబ్బు మీద ఆశ.. భార్య ఏం చేసిందో తెలుసా?

praveen
భార్య భర్తల బంధం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఇక భార్యా భర్తల బంధం ఎప్పుడు అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఒకసారి మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు అంటే  ఇక చివరి వరకు కూడా ఒకరికి ఒకరు తోడుగా..  ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతుకుతూ అంటారు.  అంతేకాదు భార్య భర్తలు ఎవరికి కష్టం వచ్చినా ఒకరు ముందుండి ఆ సమస్యను పరిష్కరించడానికి చూస్తూ ఉంటారు.  అయితే భార్య భర్తల గురించి మనం మాట్లాడుకునేవి అన్ని నేటి రోజుల్లో కేవలం సినిమాలు సీరియల్స్ లో మాత్రమే కనిపిస్తున్నాయి.  నిజ జీవితం విషయానికొస్తే మాత్రం అసలు భార్యాభర్తల బంధానికి విలువ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఏకంగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటై కడవరకు తోడుంటాం అంటూ ప్రమాణం చేసిన వారే కట్టుకున్న వారి పాలిట కాల యముడు గా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య భర్తలు ఇద్దరు పిల్లలు.. ఆ కుటుంబం మొత్తం ఎంతో హాయిగా జీవిస్తోంది. కానీ అంతలోనే భార్యకు ఒక నీచపు ఆలోచన వచ్చింది. భార్య లో ధన ఆశ పుట్టింది. ఇక 45 లక్షలు వస్తాయి అన్న కారణంతో ఏకంగా పసుపు కుంకుమలను కూడా లెక్కచేయలేదు ఆ మహిళ. మరిది తో కలిసి కట్టుకున్న భర్త ని దారుణంగా హతమార్చింది. ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలోని వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

 గ్రేటర్ నోయిడా లో నివాసం ఉంటున్న అజిత్ కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక సంసారం సాఫీగా సాగి పోతుంది. అయితే ఇటీవల భర్త పేరు మీద ఒక ఫ్లాట్ అమ్మగా 45 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ డబ్బును ఇక పిల్లల భవిష్యత్తు కోసం బ్యాంకులో వేసాడు భర్త. కానీ ఇక ఈ 45 లక్షల పై కన్నేసింది భార్య. ఎలాగైనా ఇక సొంతం చేసుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే భర్తను హతమార్చడం ఒక్కటే దారి అని అనుకుంది. ఇక దీని కోసం మరిది సహాయాన్ని కోరింది. తర్వాత పక్క ప్లాన్ ప్రకారం మరిది సహాయంతో భర్త అజిత్ను హతమార్చి నదిలో పడేసింది. అజిత్ కనపడ పోవడంతో అతని మేనల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అనుమానం వచ్చి భార్యను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: