ఇలాంటి కారు డ్రైవర్ ఉంటే... వామ్మో...!

Gullapally Rajesh
మన దేశంలో నేరాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, బీహార్ ముందు వరుసలో ఉంటాయి అనే సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా  మనం నేరాల గురించి వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇక  ఇప్పుడు ఒక నేరం వెలుగులోకి వచ్చింది. ఈ నేరం సంచలనమే. ఇంతకు ముందు కూడా విని ఉండకపోవచ్చు.  ఒక కారు డ్రైవర్ చేసిన నేరం ఇది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా వద్ద ఒక కారు డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. అతను డబ్బున్న కుటుంబానికి డ్రైవర్ గా చేరాడు. దాదాపు 12 ఏళ్ళ నుంచి అతను ఉంటున్నాడు.
అయితే వారికి ఒకరే కొడుకు ఉన్నారు. బంధువులతో కూడా ఆస్తి తగాదాలు ఉండటంతో అందరితో కూడా వాళ్ళు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని ఇతను కూడా వారికి కొడుకు గానే ఉండటం మొదలు పెట్టాడు. అన్ని అవసరాలు చూడటమే కాకుండా చిన్న చిన్న కష్టాలు వచ్చిన సమయంలో తన వంతుగా వారికి సహాయం అందిస్తున్నాడు. ఈ క్రమంలో అతని బుద్ధి లో మార్పు వచ్చింది. వారికి ఉన్న ఆస్తికి సంబంధించి అతను కన్నేసినట్టుగా తెలిసింది.  ఎలా ఏంటీ అనేది ఒకసారి చూస్తే...
కొడుకుని స్కూల్ కి తీసుకుని వెళ్ళమని చెప్పగానే అతను ఒక ప్లాన్ వేసాడు. కారుని కాలవలోకి  తీసుకుని వెళ్లి చంపాలి అని ప్లాన్ చేసాడు. చంపితే ఆస్తి మొత్తం వస్తుంది అని... స్కూల్ కి తీసుకుని వెళ్ళే సమయంలో కారుని దారి మళ్ళించి మరో దారిలో తీసుకుని వెళ్ళాడు. కారుని కాలవలోకి పోనిచ్చి అతను దూకేసాడు. అయితే పోలీసుల విచారణలో స్కూల్  ఎటో అయితే ఇటు ఎందుకు తీసుకు వచ్చావని అడిగారు. విచారణలో తమ స్టైల్ లో గౌరవ మర్యాదలు ఉండటంతో చేసిన తప్పు ఒప్పుకుని మనసులో ఆలోచన బయటపెట్టాడు. కాగా ఈ ఘటనలో చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు గుర్తించి బాలుడ్ని బయటకు లాగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: