నోరూరించే వెజ్ కోఫ్తా బిర్యానీ.. ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా..?

N.ANJI
బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. హైదరబాదీ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరూ. ఎంతో మంది దేశాలు దాటి మరీ బిర్యానీ తినడానికి వస్తుంటారు. బిర్యానీలు చాలా రకాలు. భోజనప్రియుల నోటి వెంట శడ్రుచులు పండించేందుకు రకరకాల బిర్యానీ వంటకాలు అందుబాటులో వచ్చాయి. ఈ రోజు మనం నోరూరించే వెజ్ కోఫ్తా బిర్యానీ తయారీ విధానాన్ని తెలుసుకుందాం.
కోఫ్తా బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు..
నెయ్యి- రెండు టీస్పూన్లు, దాల్చిన చెక్క- 1, యాలకులు - 3, లవంగాలు- 7, జీరా - ఒక టీస్పూన్, ఉల్లి- 1, అల్లం, వెల్లుల్లి పేస్టు – ఒక టీ స్పూన్, టమాటా - 1, పెరుగు- ఒక కప్పు, పుదీనా, కొత్తిమీర తురుము- రెండు స్పూన్లు, ఉప్పు, నీరు తగినంత తీసుకోవాలి. బాస్మతి బియ్యం- కప్పున్నర, నీళ్లు- ఎనిమిది కప్పులు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క - 2, జీరా – ఒక టీ స్పూన్, లవంగాలు- 5, నూనె- తగినంత, కుంకుమ పువ్వు నీళ్లు - ఒక టీ స్పూన్ తీసుకోవాలి.
కోఫ్తా బిర్యానీ తయారీ విధానం..


ముందుగా బాస్మతి బియ్యాన్ని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఓ గిన్నెలో పన్నీరు ముక్కలు, వెల్లుల్లి పేస్ట్, ఆలు, గరం మసాలా, కారం, శనగ పిండి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలుపుకోవాలి. అందులో కాస్త నీటిని పోసి ముద్దలా కలుపుకోవాలి. వాటిని చిన్న చిన్న బంతులుగా చేసుకుని నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద పాన్ తీసుకుని.. ఎనిమిది గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అందులో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలాకులు వేయాలి. నీళ్లు వేడి
 అయ్యాక.. బాస్మతి బియ్యం, నూనె వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత కొంచెం ఉడికిన బియ్యాన్ని జల్లెడ పట్టి చల్లటీ నీళ్లతో కడగాలి.


ఆ తర్వాత పెద్ద ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడిగైన తర్వాత బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క జీలకర్ర వేయాలి. కొంచెం సేపటి తర్వాత ఉల్లి, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం రంగు మారాక.. టమాట ముక్కలు వేసి మగ్గించాలి. ఆ తర్వాత కారం, బిర్యానీ మసాలా, ఉప్పు వేసి తక్కువ ఫ్లేమ్‌లో ఉడికించాలి. పెరుగు, పుదీనా, కొత్తిమీర, నీరు పోసి కొంచెం సేపు ఉడికాక, కోఫ్లా బాల్స్ వేసుకోని రెండు నిమిషాల తర్వాత దింపేయాలి.


ఆ తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుని అందులో కోఫ్తా కర్రీని వేసుకోవాలి. దానిపైన బాస్మతి రైస్ వేసుకోవాలి. అలా పొరపొరగా.. కర్రీ, అన్నం అమర్చుతూ రావాలి. చివరన పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, బిర్యానీ మసాలా, కుంకుమ పువ్వు నీళ్లు, నూనె, అరగ్లాస్ నీరు పోసి మూత పెట్టాలి. లో ఫ్లేమ్‌లో పావు గంట ఉడికిస్తే.. వెజ్ కోఫ్తా బిర్యానీ రెడీ. నోరూరించే కోఫ్తా బిర్యానీని ఇంట్లో కూర్చొనే ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: