సాయంత్రం వేళలో అలా లైట్ గా మరియు టేస్టీగా

Manasa
సాయంత్రం వేళలో టీ,కఫలు అయిపోయాక ఏమైనా లైట్ అండ్ టేస్టీ మరియు హెల్త్య్ స్నాక్ చేసుకుందామా? అయితే "భేల్ పూరి" చేయాల్సిందే. చాట్ బండి డేగరికి వెళ్లి తెచ్చుకోవాల్సిన పనిలేకుండా హాయిగా ఇంట్లోనే ఎలా చేయాలో చదవండి.


సాయంత్రం వేళలో టీ,కఫలు అయిపోయాక ఏమైనా లైట్ అండ్ టేస్టీ మరియు హెల్త్య్ స్నాక్ చేసుకుందామా? అయితే "భేల్ పూరి" చేయాల్సిందే. చాట్ బండి డేగరికి వెళ్లి తెచ్చుకోవాల్సిన పనిలేకుండా హాయిగా ఇంట్లోనే ఎలా చేయాలో చదవండి.


భేల్ పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు:

మురుమురాలు : 250 గ్రాములు

ఉల్లిపాయలు : 2(పెద్దవి)

టొమాటోలు :2(పెద్దవి)

కీరదోసకాయ : 2 

కొత్తిమీర :1 కట్ట

పచ్చిమిరపకాయలు:5

దానిమ్మ పండు : 1  పెద్దది 

సన్నసేగు:50 గ్రామ్స్ 

చింతపండు : కొద్దిగా

ఉప్పు : సరిపడా 

కారం : 1  టీ స్పూన్ 

నెయ్యి : 1టీ స్పూన్ 

చాట్ మసాలా : 1 టేబుల్ స్పూన్ 

పెరుగు: సరిపడా

టమాటో కెచప్ : సరిపడా


భేల్ పూరి తయారు చేసే విధానం:

కొద్దిగా చింతపండు కాసేపు నీళ్లలో నాన పెట్టుకోవాలి.

2పెద్ద ఉల్లిపాయలును ,2పెద్దటొమాటోలును, 5పచ్చిమిరపకాయలను  సన్నగా కట్ చేసుకోవాలి.2కీరదోసకాయలను పొట్టు తీయకుండా సన్నని ముక్కలు గా తరుగుకోవాలి.1 కొత్తిమీర కట్టను చాలా సన్నగా కట్ చేసుకోవాలి. 1పెద్ద దానిమ్మ పండు గింజల్ని వలుచుకోవాలి.

250  గ్రాములు మురుమురాలు తీసుకోండి. దానిలో 1టీ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు దానిలో సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయల ముక్కలని,2 పెద్ద టొమాటో ముక్కలని,5 పచ్చిమిరపకాయల ముక్కలను,2 కీరదోసకాయ ముక్కలను మురుమురాల్లో వేయాలి. మీ పులుపుకు సరిపడా చింతపండు నీళ్లు వేయాలి. 1 టీ స్పూన్ కారం పొడి,1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక ప్లేట్ లో పెట్టి  దాన్ని పైన  దానిమ్మ గింజలు, సన్న సేగు, పెరుగు,టమాటో కెచప్, కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి.

దీన్ని ఇన్స్టెంట్ గా తినేసాయి.

ఏ వయసు గలవారైనా దీన్ని హాయిగా తినేసేయొచ్చు. అటు రుచికి  రుచి  ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం.ఈజీ తో మాక్ ఈజీ తో ఈట్ అయిన భేల్ పూరి ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా,మరి ఇంతకీ మీరు ఎపుడు"భేల్ పూరి"ని చేస్తున్నారు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: