ఈరోజు గుంత పొంగనాలకి "హాయ్" చెపుదామా

Manasa
ఎప్పుడు చూసినా బ్రేక్ ఫాస్ట్  అనగానే  ఇడ్లీ, దోశ, వడ,ఉతప్ప,ఉప్మా, పెసరట్టు ఇది కనిపిస్తుంటాయి.  కాస్త డిఫరెంట్ గా టేస్టీ   అండ్ హెల్తీ గా ఏదైనా ట్రై చేద్దామా?  అయితే ఇంకేంటి మరి గుంతపొంగనాలు వైపు ఓ లుక్ ఎదాం పదండి.
 గుంత పొంగనాలకి కావలసిన పదార్థాలు:
బియ్యం : 2 1/2 గ్లాసెస్.
మినపప్పు : 1 గ్లాసు
చెనగపప్పు : 4 టేబుల్ స్పూన్లు.
ఉల్లిగడ్డలు : 2
క్యారెట్ : 1
పచ్చిమిరపకాయలు : 4
కొత్తిమీర : 1 కట్ట
ఉప్పు : సరిపడా
పసుపు : చిటికెడు
ఆవాలు : తగినన్ని
నూనె : 5 - 6  టేబుల్స్పూన్ల  
తయారు చేసే పద్ధతి:
(గమనిక:ఒకరోజు ముందు చేయాల్సిన పని)
2 1/2 గ్లాస్సెస్ బియ్యం తీసుకుని ఐదు గంటల పాటు నీళ్లలో నాన పెట్టుకోవాలి.
 1 గ్లాస్ మినపప్పు ని కూడా ఐదు గంటలపాటు నానబెట్టుకోవాలి.
తర్వాత దేనికి అది సెపరేట్ గా రుబ్బుకోవాలి. ఎప్పుడు రుబ్బుకున్న ఈ రెండు పిండి కి తగినంత ఉప్పు వేసి ఒకటిగా కలుపుని 12 గంటల పాటు పిండిని పులవనీయాలి.
 4 టేబుల్ స్పూన్లు శనగపప్పును ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
 2 ఉల్లిగడ్డలు మరియు 8  పచ్చిమిరపకాయలు సన్నగా తరుగుకోవాలి. 1  క్యారెట్ ని తురుముకోవాలి.  ఒక కొత్తిమీర ని  సన్నగా  కట్ చేసుకోవాలి
ఒక బాణలిలో కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె వేడి అయ్యాక  దీనిలో కొన్ని ఆవాలు, సన్నగా తరుగుకున్న పచ్చిమిరపకాయలు మరియు ఉల్లిపాయ ముక్కలు, తురుముకున క్యారెట్,4 టేబుల్ స్పూన్లు చేనగపప్పు, చిటికెడు పసుపు,తగినంత ఉప్పు,సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒక 2-5 నిమిషాలపాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
గుంత పొంగనాల పిండి లో ఈ ముక్కలను వేసి మంచి గా కలుపుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాల పాత్ర తీసుకొని దానిలో కొద్దిగా నూనె రాసి,  ఒక్క చెంచా సహాయంతో  కొద్ది కొద్దిగా పిండి ని  ఆ పాత్రలో వేసి  మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత పొంగనాలను ఇంకో వైపు  తిప్పి మళ్ళీ ఇంకో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. (హింట్: ఒక పుల్ల లేదా స్ట్రా తో చెక్ చేస్తూ ఉండొచ్చు) తర్వాత పొంగనాలు వేడి వేడిగా పల్లి పచ్చడి లేదా టమాటో పచ్చడి తో సర్వ్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: