పన్నీర్ తో ఎప్పుడైనా ఇలాగ పులావ్ తయారుచేసి చూడండి....!

Sravani Manne
పన్నీర్ లో ఉన్న ప్రోటిన్స్,దానిలో ఉన్న మంచి గుణాలు అన్ని ,ఇన్ని కావు.దానిని తగిన రీతిలో వండితే మాంసాహారులు సైతం చికెన్ ని మర్చిపోతారు.అలాంటి పన్నీరు తో ప్రెషర్ కుక్కర్లో ఈజీగా వండుకోగల పన్నీర్ పులావ్ తయారు చేద్దాం రండి.

కావలసిన పదార్దాలు:

నెయ్యీ:1 టేబుల్ స్పూన్

నూనె: 2 టేబుల్ స్పూన్

బిర్యాని ఆకు:2

యాలుకలు:2

లవంగాలు:4

దాల్చినచెక్క:1 మీడియం

షాజీరా:1/2 టేబుల్ స్పూన్

పన్నీరు:150 గ్రాములు

బిర్యాని రైస్:1 కప్పు

నీరు:1.5 కప్పు

జీడిపప్పు:5 పలుకులు

ఉల్లిపాయలు:1 పెద్దది

పచ్చిమిరపకాయలు:3

అల్లం వెల్లుల్లి పేస్టు:1 టీ స్పూన్

తయారి విదానం:

ముందుగా ప్రెషర్ కుక్కర్ ను స్టవ్ వెలిగించి నెయ్యీ,నూనె వేసి వేడి అయిన తర్వాత బిర్యాని ఆకు, యాలుకలు, లవంగాలు, దాల్చినచెక్క, షాజీరా వేసి  వేయిoచాలి.తరువాత ఉల్లిపాయలు చిలికలుగా కోసుకొని వేయాలిఅవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిoచాలి.తర్వాత పచ్చి మిరపకాయలు వేసి వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసిపచ్చి వాసన పోయే వరకు వేయిoచాలి.తర్వాత ముందుగా అర గంట క్రితం కడిగి నాన బెట్టుకున్న బిర్యాని రైస్ను వేసి కొంచం సేపు వేపుకోవాలి. తర్వాత ఇందులో నీరు వేసి నీరు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత పన్నీరు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తరువాత మూత తీసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే.అదే మనం మాములు రైస్ తో చేసుకోవాలి అంటే బియాన్ని గంట క్రితం నానబెట్టుకోవాలి.నీటిని ఒక కప్పు బియ్యానికి రొండు కప్పుల నీటిని తీసుకోవాలి.అలాగే పాన్లో చేసుకోవటానికి బిర్యాని రైస్ను కి 2 కప్పుల నీరు కావాలి.పన్నీరును ఎప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టే ముందు వేయాలి గుర్తుంచుకోండి.లేకపోతే పన్నీర్ ముక్కలు ముక్కలుగా ఐయిపోతుంది.అంతే పన్నీర్ తో ఎప్పుడైనా ఇలాగ పులావ్ తయారుచేసి చూడండి.ఒకసారి తయారు చేసి పెడితే మళ్ళి ఇలానే కావాలని అంటారు.మాంసాహారులు సైతం చికెన్ ని మర్చిపోతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: