కంద పులుసు గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా..?

Suma Kallamadi
మీ అందరికి కంద గురించి తెలిసే ఉంటుంది. చాలా మందికి అయితే అసలు కందతో కూర వండుతారు అనే విషయం కూడా తెలిసి ఉండకపోవచ్చు.కానీ కందతో మీరు మేము చెప్పే విధంగా పులుసు పెట్టి చూడండి. పుల్ల పుల్లగా ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది. మరి కంద పులుసు తయారు చేయడానికి కావలిసిన పదర్ధాలు ఏంటో తెలుసుకుందామా. !
 కావలసిన పదార్ధాలు  :
కంద ఒకటి -
చింత పండు -10 గ్రాములు
పసుపు -చిటికెడు
ఉప్పు -సరిపడా
బెల్లం -చిన్న ముక్క
పచ్చి మిర్చి -1 లేదా 2
బియ్యప్పిండి -1 టేబుల్ స్పూన్
నూనె -1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి- 1 లేదా 2
ఆవాలు- 1 టీ స్పూన్
జీలకర్ర -1 టీస్పూన్
ఇంగువ - కొద్దిగా
కరివేపాకు -4-5 రెబ్బలు
కొత్తిమీర -కొద్దిగా
తయారు చేయు విధానం:
ముందుగా కందను తీసుకుని దాని మీద ఉన్న మట్టి పోయేంతవరకు బాగా కడుకోవాలి. ఆ తరువాత మీ చేతులకి నూనె రాసుకుని కంద మీద ఉన్న నల్లటి చెక్కు తీయాలి . చేతులకి నూనె ఎందుకు రాసుకోవాలంటే కంద మీద ఉన్న చెక్కు తీసేటప్పుడు దురదలు రాకుండా ఉండడానికీ చేతిలోకి నూనె రాసుకోవాలి. ఇప్పుడు చెక్కు తీసిన కందను ఒక మాదిరి ముక్కలుగా కోసుకోవాలి.ఇప్పుడు తరిగిన ముక్కలలో కొద్దిగా నీళ్ళు ప, సుపు వేసి ప్రెజర్ కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చేదాకా ఉంచాలి. ఆ తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత తీసి ముక్కలలోని నీటిని వంచేసి  ఒక గిన్నెలోకి మార్చుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టుకుని నూనె పోయాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి,  ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేపాలి.అవి వేగిన తరువాత ముందుగా వుడక పెట్టుకున్న కంద  ముక్కలను కూడా అందులో  వేయాలి. ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఉప్పు,కారం వేసి మూత పెట్టాలి.ఆ తరువాత చింతపండు రసం పోయాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో బియ్యప్పిండిని వేసుకుని కొంచెం నీరు పోసి ఉండలు లేకుండా కలుపు కుని మరుగుతున్న పులుసులో పోయాలి.ఇలా చేయడం వలన పులుసు చిక్క పడుతుంది.ఆ తరువాత కొద్దిగా బెల్లం, ఇంగువ కూడా వేసి ఒకసారి తిప్పి మూత పెట్టేయండి. కూర దగ్గర పడిన తరువాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే కంద పులుసు రెడీ అయినట్లే.మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: