చపాతీ వెజ్ రోల్స్ ఎలా చేయాలంటే..?

Suma Kallamadi
మీరు ఎప్పుడన్నా చపాతీలు తిని ఉంటారు కానీ చపాతీ  వెజ్‌ రోల్స్‌ తిని ఉండరు కదా. చాలా బాగుంటుంది. ఇవి చేస్తే మళ్ళీ మీరు చపాతీలోకి సైడ్ డిష్ చేయాలిసిన పని ఉండదు. అలాగే స్నాక్ ఐటమ్ గా కూడా ఇది తినవచ్చు. మరి ఆలస్యం చేయకుండా చపాతీ వెజ్ రోల్స్ ఎలా  చేయాలో చూద్దామా. !
కావలసిన  పదార్ధాలు :
చపాతీలు – 4,
క్యాప్సికమ్‌ – 2,
టమాటోలు –2,
బంగాళ దుంపలు – 2
పచ్చి బటానీలు – 2 టేబుల్‌ స్పూన్లు
ఉల్లి పాయ – 2
పచ్చి మిర్చి – 3
మిరియాల పొడి – 1 టీ స్పూన్‌,
జీలకర్ర పొడి – 1 టీ స్పూన్‌,
పసుపు – అర టీ స్పూన్‌,
టమాటో కెచప్‌ – 1 టీ స్పూన్‌,
ఉప్పు – సరిపడా,
నూనె – తగినంత
తయారీ విధానం :
ముందుగా బంగాళా దుంపలను పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికించుకుని ముక్కలుగా కోసుకోవాలి. అలాగే పచ్చి బఠాణీలను కుడా కాసేపు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోండి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక చిన్నగా తరిగిన పచ్చి మిర్చి, ఉల్లి పాయ ముక్కలు వేసి ఎర్రగా  వేయించుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కోసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, టమాట ముక్కలను వేసి వేపాలి. అవన్నీ వేగిన తర్వాత ముందుగా మెత్తగా ఉడికించుకున్న  బంగాళదుంప ముక్కలు కూడా వేయండి. వీటితో పాటు నానపెట్టుకుని ఉన్న బటానీలు వేసుకుని కూడా వేసి ఒకసారి గరిటెతో తిప్పండి.కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ఆ తరువాత ఉప్పు, కొద్దిగా కారం,  జీలకర్ర పొడి, టమాటా కెచప్‌ వేసి ఒక రెండు నిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. కూర రెడీ అయినట్లే. ఇప్పుడు ముందుగా చేసుకున్న  చపాతీలను పెనంపై నూనె పోసి ఇరువైపులా కాల్చుకుని వండుకున్న  కర్రీని చపాతీపై ఒకవైపు వేయాలి. ఆ తర్వాత చపాతీని  రోల్స్‌ మాదిరిగా చుట్టాలి.అంతే చపాతీ రోల్స్ రెడీ అయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: