క్యాలీఫ్లవర్లో ఎగ్ వేస్తే ఆ టేస్టే వేరు కదా. !

Suma Kallamadi
క్యాలీ ఫ్లవర్ లో కోడి గుడ్డు వేసి ఎప్పుడన్నా కర్రీ వండరా.. టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే ఒకసారి క్యాలీ ఫ్లవర్ లో ఎగ్ వేసి ట్రై చేయండి.
కావలిసిన పదర్ధాలు :
350 గ్రాముల కాలి ఫ్లవర్
3 ఎగ్స్  
పెద్ద ఉల్లి పాయ ఒకటి
1 టొమోటో
2 పచ్చి మిరప కాయలు
1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
 
1 టేబుల్ స్పూన్ జీల కర్ర పొడి
1 tsp కారం
నూనె సరిపడా
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1 టేబుల్ స్పూన్ గరం మసాలా
1 టేబుల్ స్పూన్ ఉప్పు
కొత్తి మీర తరుగు -కొద్దిగా
తయారీ విధానం :
ముందుగా క్యాలీ ఫ్లవర్ ను శుభ్రంగా ఉప్పు నీటిలో కడగాలి.ఇలా కడగడం వలన పువ్వులో ఎమన్నా పురుగులు ఉంటే బయటకు వచ్చేస్థాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో సరిపడా నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేపాలి. అవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే దాక వేపాలి. ఇప్పుడు అందులో చిన్నగా తరిగిన  క్యాలీ ఫ్లవర్ ముక్కలు వేసి వేపాలి. కొద్ది సేపు అయ్యాక ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. క్యాలీ ఫ్లవర్ మగ్గిన తరువాత కారం కూడా వేయాలి. ఒక 5 నిముషాలు అయ్యాక కోడిగుడ్లు ఒకదాని తరువాత ఒకటి కొట్టి కూరలో వేసి ఒకసారి తిప్పి మూత పెట్టేయండి. 5 నిముషాలు అయ్యాక మళ్ళీ కూరని ఒకసారి గరిటెతో తిప్పి ధనియాల పొడి, జీల కర్ర పొడి వేసి, గరం మసాలా వేయండి. కూరలో నూనె పైకి కనిపించే అంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి.చివరగా కొత్తి మీర వేసి గార్నిష్ చేయండి.ఈ కూరని అన్నంలో కానీ, చపాతీలో గాని వేసుకుని తింటే చాలా బాగుంటుంది. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: