బీన్స్ కర్రీ ఇలా ఎప్పుడన్నా ట్రై చేశారా..?

Suma Kallamadi
చాలా మంది బీన్స్ తినడానికి ఇష్టం చూపించరు.కానీ బీన్స్ తినటం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే మీరు బీన్స్ లో టొమోటో వేసి వండి చూడండి. చాలా రుచికరంగా ఉంటుంది. బీన్స్ అండ్ టొమోటో కాంబినేషన్ ఎప్పుడు కూడా సూపర్ గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా బీన్స్ అండ్ టొమోటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. !
కావలిసిన పదార్ధాలు :
300 గ్రాముల బీన్స్
2 మీడియం సైజ్ ఉల్లి పాయల తరుగు
2 పచ్చి మిరప కాయలు
2 మీడియం టొమాటోలు
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
¼ టేబుల్ స్పూన్  పసుపు
1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
2 టేబుల్ స్పూన్  కారం
ఉప్పు తగినంత
4 లేదా 5 టేబుల్ స్పూన్స్ నూనె
¼ కప్ కొత్తి మీర
తయారీ విధానం :
 ముందుగా బీన్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమోటోలు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి కొంచెం కాగనివ్వండి ఇప్పుడు పచ్చిమిర్చి,ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి  ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి.ఉల్లిపాయ వేగిన తరువాత అందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు చిన్నగా తరిగి ఉంచుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసి ఒక సారి  కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద వేపాలి.ముక్కలు బాగా మగ్గిన తరువాత కారం కూడా వేసి ఒక రెండు నిముషాలు పాటు మూత పెట్టి ఉంచండి.బీన్స్ ముక్కలు మెత్తబడిన తరువాత  టమాటో ముక్కలు వేయండి. వాటితో పాటు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి ఒకసారి కలపి మూత పెట్టేయండి. ఈ కూరలో నీళ్లు పోయనవసరం లేదు. టొమోటో బాగా మగ్గిన తరువాత చివరలో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేసుకోవాలి.అంతే బీన్స్ అండ్ టొమోటో కర్రీ రెడీ అయినట్లే. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: