సొరకాయతో అదిరే స్వీట్ చేశారా..?

Suma Kallamadi
సొరకాయతో కూరలు మాత్రమే వండు కుంటాము అని అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే సొర కాయతో కూడా ఒక మంచి అద్భుతమైన స్వీట్ రెసిపీ తయారు చేయవచ్చు తెలుసా.అవును అండి సొరకాయతో హాల్వా తయారు చేసి చూడండి ఎంతో టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది మరి. మరి ఆలస్యం చేయకుండా సొరకాయ హాల్వా ఎలా తయారు చేయాలో చూద్దామా.
కావలిసిన పదర్ధాలు
 300 గ్రాములు సొరకాయ తురుము
1/3 కప్పు పాలు
¼ కప్పు పంచదార
4 టేబుల్ స్పూన్స్ నెయ్యి
10 జీడి పప్పులు
10 బాదం పప్పులు
4 పిస్తా పప్పులు
2 టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్ష
¼ టేబుల్ స్పూన్  యాలకుల పొడి
తయారు చేయు విధానం :
ముందుగా ఒక లేత సొర కాయను తీసుకుని దాని చెక్కు తీసేసి లోపల ఉన్న సొర కాయ గింజలు కూడా తీసేసి బాగా సన్నగా కోసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు  స్టవ్ ఆన్ చేసి అందులో ఒక పాన్ పెట్టు అందులో నెయ్యి వేడి చేసి  
జీడి పప్పు పలుకులు, బాదం పప్పు, ఎండు ద్రాక్షలను వేసి ఎర్రగా, మంచి వాసన వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్ లో సొర కాయ తురుము కూడా వేసి పచ్చి వాసన పోయే దాక  వేయించాలి.ఆ తరవాత సొర కాయ తురుములో పాలు పోసి తిప్పుతూ బాగా మరిగించాలి.ఈ మిశ్రమం కొంచెం దగ్గర పడిన తరువాత  పంచదార కూడా వేసి తిప్పుతూ హల్వా చక్కగా దగ్గర పడే దాక వేపాలి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న జీడి పప్పులు వేసి, కిస్ మిస్, బాదాం వేసి ఒకసారి కలిపి స్టవ్ కట్టేసుకోవాలి.అంతే నోరూరించే సొరకాయ హల్వా రెడీ అయినట్లే.మరి మీరు కూడా ఒక సారి ట్రై చేసి చూడండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: