నోరూరించే గోంగూర మటన్ బిర్యానీ మీకోసం. !

Suma Kallamadi
ఆదివారం వస్తే చాలు అందరి వంట గదుల్లో నాన్ వెజ్ వాసన గుబాళిస్తూ ఉంటుంది. సండే ఏ కూర వండాలి అని ముందు రోజు నుంచే ఆలోచన మొదలుపెడతాం కదా. అందుకే ప్రతీరోజు అన్నం తింటున్నాం కాబట్టి ఈసారి ఎంచక్కా గోంగూరతో మటన్ బిర్యానీ తయారుచేసి చూడండి. ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ మటన్ అండ్ గోంగూర కాంబినేషన్ బిర్యాని. గోంగూరలోని పులుపు, మాసాలాల్లో ఉన్న ఘాటుతనం అన్ని కలిసి బిర్యానీకి మంచి రుచిని తెస్తాయి. చెప్తుంటేనే నోరు ఊరిపోతోంది కదా మరి తింటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరి గోంగూర మటన్ బిర్యానీ కోసం కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దామా. !
కావలిసిన పదార్ధాలు :
బియ్యం.. కిలో
మటన్.. కిలో
గోంగుర కట్టలు - నాలుగు
పెరుగు- 2 కప్పులు
పచ్చిమిర్చి -ఏడు
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్  
దాల్చిన చెక్క- 2 చిన్న ముక్కలు
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 3 టేబుల్ స్పూన్స్
లవంగాలు – 4
యాలకులు – 4
కారం – 2 టేబుల్ స్పూన్స్
పుదీనా తరుగు – 4 కప్పులు
ఉల్లిపాయ తరుగు – మూడు కప్పులు
ఉప్పు – తగినంత
బిర్యానీ దినుసులు -అన్ని
 
తయారి విధానం :
ముందుగా ఒక గిన్నెలోకి బాస్మతి బియ్యంను తీసుకుని శుభ్రంగా  కడిగి ఒక అరగంట పాటు నానబెట్టాలి. అలాగే గోంగూర ఆకులను కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ  తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి అందులో నూనె వేసి లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క,బిర్యానీ దినుసులు అన్ని వేసి వేపాలి . అవి వేగిన తరువాత పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఎర్రగా వేయించాలి. అవి వేగిన తరువాత గోంగూర ఆకులు వేసి రెండు నిముషాలు వేపిన తరువాత పెరుగు, మటన్  కారం, ఉప్పు వేసి సన్నటి మంటపై ఉడికించాలి. మరో గిన్నెలో నీటిని మరిగించి అందులో నానబెట్టిన బియ్యం వేసి సగం ఉడికిన తర్వాత ఆ రైస్ ను గోంగూర మటన్ గ్రేవీలో వేయాలి. అంతా ఒకసారి మెల్లగా తిప్పి ఆవిరి పోకుండా మూత పెట్టి 20 నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.బిర్యానీ ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేయండి. అంతే టేస్టీ టేస్టీ గోంగూర మటన్ బిర్యానీ తయారు అయిపోయినట్లే. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: