అతి తక్కువ సమయంలోనే చేసే స్వీట్ ఇదే..!

Suma Kallamadi
ఈ రోజు ఒక కమ్మని, తియ్యని స్వీట్ రెసిపీ గురించి మనం తెలుసుకుందాం. స్వీట్ తినాలని అనిపించే వారికి ఈ సేమ్యా కేసరి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. తక్కువ టైం లోనే ఒక మంచి స్వీట్ రెడీ అయిపోతుంది.అలాగే తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సేమ్యా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దామా. !
 కావాల్సిన పదార్ధాలు
1 cup సెమ్యా
2 cup నీళ్ళు
3/4 cup పంచదార
1/4 cup జీడి పప్పు
2 tbsp ఎండు ద్రాక్ష
2 tbsp నెయ్యి
1 tsp యాలకల పొడి
బాదాం పప్పులు -5
కుంకుమ పువ్వు
తయారీ విధానం :
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి జీడీ పప్పు, కిస్మిస్, బాదాం పలుకులు వేసి ఎర్రగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి.తరువాత మిగిలిన నెయ్యిలో సేమ్యాలు కూడా వేసి మంచి వాసన వస్తూ, ఎర్రగా అయ్యే దాకా వేపాలి. ఇప్పుడు ఈ సేమ్యాను ఒక గిన్నెలోకి తీసుకుని అదే పాన్ లోకి నీళ్ళు పోసి అందులో చిటికెడు కుంకుమ పువ్వు వేసి పెద్ద మంట మీద మరగనివ్వాలి. కుంకుమపువ్వు వేయటం వలన స్వీట్ కి  మంచి  మంచి రంగు అనేది వస్తుంది,. నీళ్లు మరిగిన తరువాత ముందుగా ఎర్రగా వేపుకున్న సేమ్యాలు వేసి గరిటెతో తిప్పాలి. సేమ్యాలు కొద్దిగా మెత్త పడిన తరువాత అందులో సరిపడా పంచదార, యాలకల పొడి బాగా ఉడికించాలి.అందులోని నీరు అంతా ఇగిరి పోయి చక్కగా పాకంలాగా కనిపించే  అంత వరకు పొయ్యి మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసి వేపిన జీడి పప్పు, కిస్మిస్, బాదాం పలుకులు వేసి దింపేసుకోవాలి.అంతే ఎంతో తియ్యని సేమ్యా కేసరి రెడీ అయినట్లే. ! మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒక సారి ఈ స్వీట్ ను  తయారు చేసి చూడండి



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: