ఈ కాంబినేషన్ ఎప్పుడన్నా ట్రై చేసారా..?

Suma Kallamadi
దొండకాయ కూర అంటే చాలామంది ఇష్టంగా తింటారు. అలాగే దొండకాయలను ఫ్రై మాత్రమే చేస్తారు అని చాలామందికి తెలుసు కానీ దొండకాయలో టమోటోలు వేసి కూర చేస్తే చాలా బాగుంటుంది.. ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి సరి కొత్తగా దొండకాయలను ఇలా వండి చూడండి. చాలా బాగుంటుంది కర్రీ. మరి ఆలస్యం చేయకుండా కావలిసిన పదార్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా.
 కావాల్సిన పదార్ధాలు
దొండకాయలు 250 గ్రా.లు
ఉల్లిపాయ 1
కొబ్బరి పొడి -కొద్దిగా
పచ్చిమిర్చి 3
టమాటాలు 2
పసుపు 1/4 టీస్పూన్
కారంపొడి 1 టీస్పూన్
కరివేపాకు 2 రెబ్బలు
అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్
ధనియాల పొడి 1 టీస్పూన్
గరం మసాలా పొడి 1/4 టీస్పూన్
ఉప్పు తగినంత
నూనె 3 టీస్పూన్లు
 తయారు చేయు విధానం
ముందుగా దొండకాయలను శుభ్రంగా కడికి కొంచెం పెద్ద ముక్కలుగాకొసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో సరిపడా నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు,  కరివేపాకు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అందులో కొద్దిగా పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపాలి. తరువాత ముందుగా కోసుకుని ఉంచుకున్న దొండకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి గరిటెతో ఒకసారి తిప్పి మూత పెట్టి ఉంచండి
దొండకాయ ముక్కలు మెత్తగా అయ్యాక ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేయండి. ఇప్పుడు కొద్దిగా కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలిపి ఒక 5 నిముషాల ఉడికించాలి. ఆ తరువాత మూత తీసి అరకప్పు నీళ్ళు పోసి ఉడికించండి. కూర దగ్గర పడే సమయంలో కొద్దిగా కొబ్బరి పొడి చల్లండి.నూనె పైకి కనిపించిన తరవాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తరువాత కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. అంతే దొండకాయ అండ్ టొమోటో కూర రెడీ అయిపోయినట్లే. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: