రొయ్యలలో ఈ ఆకు వేసి వండితే భలే టేస్టీగా ఉంటుంది తెలుసా..?

Suma Kallamadi
ఈ కాలంలో చింత చిగురు బాగా లభిస్తుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్న కారణంగా చెట్లు చిగురించి కొత్త ఆకులు వస్తాయి. అలాగే చింత చిగురు తినడానికి  పుల్లగా చాలా బాగుంటుంది. మరి అలాంటి చింత చిగురులో రొయ్యలు వేసుకుని వండితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.వింటుంటేనే నోరు ఊరిపోతోంది కదా. మరి తింటే ఇంకెలా ఉంటుందో కదా.మరి ఆలస్యం చేయకుండా చింత చిగురు రొయ్యలు కూర ఎలా వండాలో చూద్దామా
కావలసిన పదార్ధాలు :
పచ్చి రొయ్యలు: అర కేజీ
చింత చిగురు : పావు  కేజీ
ఉల్లి పాయలు : పావు కేజీ
పచ్చి మిరప కాయలు : నాలుగు
నూనె : సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టేబుల్ స్పూన్
పసుపు : ఒక టీ స్పూన్
కారం: సరిపడా
ఉప్పు: సరిపడా
గరం మసాలా -ఒక టీ స్పూన్
తయారీ విధానం:
 
ఒక గిన్నె తీసుకుని శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలని అందులో వేయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కడగండి. తర్వాత చింత చిగురులో ఎమన్నా కాడలు ఉంటే తీసేసి ఆకులని మెత్తగా అయ్యేలాగా చేతితో నలుపుకొండి. తరువాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో సరిపడా నూనె పోసి నూనె  కాగిన తరువాత అందులో ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి వేపాలి మగ్గనివ్వాలి.తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే దాకా వేపాలి. ఇప్పుడు  ఉల్లి పాయ ముక్కలలో పచ్చి రోయ్యలతో పాటు కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒక ఐదు నిముషాలు మూత పెట్టి ఉంచండి.ఆ తర్వాత మెత్తగా నలుపుకున్న చింత చిగురు కూడా వేసి కారం కూడా  వేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి.పది నిముషాలు అయ్యాక కొద్దిగా నీళ్లు పోసి మరో 5 నిముషాలు ఉడకనివ్వండి. తరువాత గరం మసాలా పోడి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: