ఎగ్స్ అండ్ టొమోటో కర్రీ కాంబో అదుర్స్.. !!

Suma Kallamadi
కోడిగుడ్డును ఇష్ట పడని వారు అంటూ ఎవరు ఉంటారు చెప్పండి. అందరూ కూడా గుడ్డును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కోడి గుడ్డుతో ఆమ్లెట్ వేసుకున్న గాని కర్రీ వండుకున్నాగాని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈరోజు ఘుమ ఘుమ లాడే ఎగ్స్ అండ్  టొమోటో కర్రీ ఎలా వండాలో వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా టొమోటో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసెయ్యండి.
కావలిసిన పదార్ధాలు :
1/2 కేజీ ఎర్రగా పండిన టొమోటోలు
5 కోడి గుడ్లు
2 మీడియం ఉల్లిపాయల తరుగు
2 పచ్చి మిరపకాయలు
1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
¼ tsp పసుపు
1 ½ tbsp కారం
1 tsp ధనియాల పొడి
ఉప్పు తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా
¼ కప్పు కొత్తిమీర
6 లేదా 7 tbsp నూనె
తయారీ విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కోడిగుడ్లు వేసి కొద్దిగా నీళ్లు పోసి గుడ్లను ఉడకబెట్టుకోవాలి. తరువాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అందులో సరిపడా నూనె పోసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి.ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు సన్నగా ముక్కలుగా కోసుకున్న టొమోటో ముక్కలు కూడా అందులో వేసి కొద్దిగా పసుపు,ఉప్పు వేసి మూత పెట్టండి. ఒక 10 నిముషాలు అయ్యాక టొమోటో ముక్కలు మగ్గిన తరువాత ఉడకబెట్టిన కోడి గుడ్లకు అక్కడక్కడా చాకుతో గాట్లు పెట్టి కూరలో వేయండి. ఇప్పుడు కూరలో సరిపడా కారం వేసి ఒకసారి కలిపి కేవలం ఒక టీ గ్లాసు నీళ్లు మాత్రమే పోసి మూత పెట్టేయండి.కొద్ది సేపు అయ్యాక మూత తెరిచి ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలపండి. కూరల్లో నీళ్లు ఇగిరిపోయి నూనె పైకి తేలేదాక పొయ్యి మీదనే ఉంచండి.నూనె పైకి కనిపించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవడమే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: