క్రిప్సీ క్రిప్సీ గా ఉండే బెండకాయ ఫ్రై మీకోసం. !!

Suma Kallamadi
సాధారణంగా బెండకాయ కూర అంటే చాలామంది తినడానికి ఇష్ట పడరు. ఎందుకంటే బెండకాయ కూర వండినప్పుడు జిగురు వస్తుంది. కావున దానిని తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అందుకే ఇండియా హెరాల్డ్ వారు మీకోసం బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా.. ముందుగా కావాల్సిన పదార్ధాలు ఏంటో చూడండి.
కావలిసిన పదర్ధాలు :
500 gms బెండకాయలు
2 కరివేపాకు
1/4 cup వేరు సెనగగుళ్ళు
1/4 cup బియ్యం పిండి
1/4 cup సెనగపిండి
1/2 tsp గరం మసాలా
2 tbsps పచ్చి కొబ్బరి తురుము
సాల్ట్
1 tsp జీలకర్ర
1 tsp కారం
6 వెల్లులి
5 పచ్చిమిర్చి
నూనె- వేయించడానికి
తాలింపు దినుసులు సరిపడా
తయారీ విధానం:
ముందుగా లేత బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా రౌండ్ గా కట్ చేసుకోండి. తరువాత బెండకాయ ముక్కల్లో కొద్దిగా బియ్యం పిండి, సెనగపిండి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర, నీళ్లు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో సరిపడా నూనె పోసి  వేడి అయ్యాక కొద్దిగా పల్లీలు వేసి వేపుకుని పక్కన పెట్టుకోండి.వాటితో పాటు తరువాత కరివేపాకును కూడా వేపుకోండి. ఇప్పుడు అదే నూనెలో బెండకాయ ముక్కలని వేసి మెల్లగా తక్కువ మంట మీద ఎర్రగా వేపుకోవాలి.వేగిన ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని గరం మసాలా పొడి చల్లండి.తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసి అందులో తాలింపు దినుసులు, కరివేపాకు వేసి వేపండి. ఇప్పుడు వేపుకున్న బెండకాయ ముక్కలు తాలింపులో వేసి వేరు సెనగపప్పు,  పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొండి.అంతే క్రిప్సీ క్రిప్సిగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయినట్లే. చారులోకాని, సాంబార్ లో గాని ఈ బెండకాయ ఫ్రై నంచుకుని తింటే చాలా బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: