మష్రూమ్స్ -ఆలూ కాంబో అదుర్స్. !

Suma Kallamadi
మష్రూమ్స్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. వీటినే కొంతమంది పుట్ట గొడుగులు అని కూడా అంటారు.అప్పట్లో మష్రూమ్స్ ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే లభ్యం అయ్యేవి.కానీ ప్రస్తుత కాలంలో మష్రూమ్స్ విరివిగా అన్నిచోట్లా లభ్యం అవుతున్నాయి . పుట్టగొడుగులతో చేసే కర్రీ ఎంతో రుచికరంగా ఉంటుంది.అందుకనే ఇండియా హెరాల్డ్ వారు చెప్పే విధంగా పుట్టగొడుగులను, బంగాళాదుంపలతో కలిపి వండి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మష్రూమ్స్ అండ్ ఆలూ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. !
కావలిసిన పదార్ధాలు :
200 గ్రాములు పుట్టగొడుగులు
2 బంగాళాదుంపలు
2 ఉల్లిపాయలు
3 పచ్చిమిరప కాయలు
1 టమాటో
1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
1 ½ tsp కారం
1 tsp గరం మసాలా
4 tbsp నూనె
¼ కప్పు పుదీనా ఆకులు
¼ కొత్తిమీర
తయారు చేసే విధానం :
ముందుగా పుట్టగొడుగుల్ని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తరువాత బంగాళాదుంపలను కూడా కట్ చేసి పెట్టుకుండి. ఉల్లిపాయలను మాత్రం చిన్నగా కాకుండా బారుగా నిలువుగా కోసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత అందులో బారుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపాలి. కొద్దిగా వేగిన తరువాత  ఉప్పు వేయండి.తర్వాత బంగాళదుంప ముక్కలు, టొమోటో ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేపండి. ఆ తరువాత ముక్కలుగా కోసుకున్న పుట్టగొడుగులను కుడా వేసి అందులో పసుపు, కారం వేసి ఒకసారి కలపి మూత పెట్టండి.రెండు నిమిషాల అయ్యాక గరం మసాలా పొడి వేసి కలిపి నూనె పైకి తేలేవరకు ఉంచి చివరలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: