ఓట్స్ తో వెరైటీ టిఫిన్.. !

Suma Kallamadi
ప్రతి రోజు దోశ, ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిందా.మీ ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుండి పిల్లల వరకు టిఫిన్ పేరు చెబితే చాలు వామ్మో టిఫీనా..?  అని ముఖం ముభావంగా పెడుతున్నారా.. అయితే ఒకసారి ఇండియా హెరాల్డ్ వారు చెప్పే వెరైటీ ఓట్స్ ఇడ్లీ టిఫిన్ ను ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండడంతో  పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా ఆ టిఫిన్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా. !
ఓట్స్‌పొడి: కప్పు
నూనె: మూడు చెంచాలు
ఆవాలు: చెంచా
మినప్పప్పు: అరచెంచా
సెనగపప్పు: చెంచా
జీలకర్ర: అరచెంచా
కరివేపాకు రెబ్బలు: రెండు
అల్లం ముద్ద: అరచెంచా
పచ్చిమిర్చి: రెండు క్యారెట్‌ ఒకటి(తురమాలి)
పసుపు: పావుచెంచా
రవ్వ: అరకప్పు
పెరుగు: అరకప్పు
నీళ్లు: కప్పు
కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు
ఉప్పు: తగినంత,
జీడిపప్పు పలుకులు: కొన్ని,
ఉప్పు - తగినంత
తయారీ విధానం :
ముందుగా స్టౌ వెలిగించి పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అందులో మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆ నూనెలో జీడిపప్పు వేసి వేపుకోండి. అవి వేగిన తరువాత ఒకగిన్నెలొకి తీసుకుని అదే నూనెలో ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం ముద్ద, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్‌ తురుము, పసుపు వేసి వేయించాలి. అవి అన్నీ వేగిన తరువాత అందులో రవ్వ కూడా వేసి ఎర్రగా వేయించాలి. తరువాత  ఓట్స్‌ పొడి వేసి ఓక సారి వేయించి పొయ్యి ఆఫ్ చేయండి.ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారిన తరువాత అందులో కొద్దిగా పెరుగు, అర కప్పు నీళ్లు, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు వేసి మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు అందులోనే మరో అరకప్పు నీళ్లు పోసి కలిపి మూత పెట్టేయాలి. ఈ పిండిని ఒక అరగంట పాటు నానపెట్టి ఉప్ప వేసి మరోసారి కలపి ఇడ్లి ప్లేట్స్ లో ఇడ్లీల్లా వేసుకుని స్టవ్ మీద ఒక పావు గంట సేపు పాటు  ఆవిరిమీద ఉడికించుకుని తీసుకోవాలి.అంతే ఓట్స్ ఇడ్లీ లు రెడీ అయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: