జీడిపప్పుతో ఫ్రై ఎప్పుడన్నా ట్రై చేసారా.?

Suma Kallamadi
జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రస్తుత కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి జీడిపప్పును తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే ఈ జీడి పప్పులో ఎన్నో రకాలయిన పోషక పదార్ధాలు వున్నాయి.జీడిపప్పు తినడానికి కూడా చాలా రుచి కరంగా ఉంటుంది. ఒత్తిగా జీడిపప్పు తినడం కంటే జీడిపప్పు ఫ్రై చేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే ఇండియా హెరాల్డ్ వారు మీకోసం ఈరోజు జీడి పప్పు ఫ్రై ఎలా చేయాలో వివరించబోతున్నారు.మరి జీడిపప్పు ఫ్రైకి కావాల్సిన పదార్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా. !
కావలిసిన పదార్ధాలు :
100 gms జీడి పప్పు బద్దలు
150 gms సెనగ పిండి
2 రెబ్బల  కరివేపాకు
1 tsp కారం
1 tsp జీలకర్ర
1 tsp అల్లం వెల్లూలి పేస్టు
1/2 tsp గరం మసాలా
1/2 tsp ధనియాల పొడి
సరిపడా నీళ్ళు
1 tbsp డాల్డా/నెయ్యి/నూనె
నూనె వేపడానికి సరిపడా
తయారు చేయు విధానం:
ముందుగా ఒక గిన్నె తీసుకుని జీడిపప్పు బద్దలు వేసి సరిపడా నీళ్ళు పోసి 2 గంటలు నాన నివ్వండి.అవి నానిన తరువాత నీటిని వడకట్టాలి.ఆ తరువాత  జీడిపప్పులో సెనగ పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా,జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, నీరు పోసి పొడి పొడిగా కలుపుకోండి.తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో నూనె పోయండి.నూనె కాగిన తరువాత అందులో  పకోడీని పొడి పొడిగా వేసుకుంటూ  మీడియం ఫ్లేం మీద ఎర్రగా వేపుకోవాలి.జీడిపప్పు వేగడానికి కాస్త సమయం పడుతుంది. ఎక్కువ మంట పెడితే జీడిపప్పు మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేపాలి. చివరగా కరివేపాకు కూడా నూనెలో వేసి వేపుకుని జీడి పప్పు ఫ్రై లో గార్నిష్ చేయండి. అంతే కర కర లాడే టేస్టీ టేస్టీ జీడి పప్పు ఫ్రై రెడీ అయినట్లే. !



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: