రసం అంటే మాములు రసం కాదండోయ్ ఇది.. !

Suma Kallamadi
ప్రతి రోజు కూరలు తిని తిని బోర్ కొట్టిందా. అయితే ఒక్కసారి ఇండియా హెరాల్డ్ వారు చెప్పే ఈ మిరియాల రసాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మిరియాల ఘాటు ఈ రసం ద్వారా మీకు బాగా తెలుస్తుంది. అలాగే మిరియాల రసం వలన మనకి ఇమ్మ్యూనిటీ శక్తి కూడా పెరుగుతుంది. ఈ వర్షా కాలంలో జలుబు, దగ్గు సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారికి ఈ మిరియాల రసం బాగా ఉపశమనాన్ని ఇస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మిరియాల చారు ఎలా పెట్టాలో చూద్దామా. !
కావాల్సిన పదార్ధాలు:
1 టేబుల్ స్పూన్  మిరియాలు
10 - 12 వెల్లూల్లి రెబ్బలు
1 tbsp జీలకర్ర
చింతపండు పులుసు సరిపడా
1 టొమాటో ముక్కలు
1 నూనె సరిపడా
1/4 tsp పసుపు
3 ఎండు మిర్చి
1 tsp ఆవాలు
3 - 4 కరివేపాకు
కొత్తిమీరా తరుగు కొద్దిగా
ఉప్పు
ఇంగువ
ఎండు కొబ్బరి -కొద్దిగా
 ధనియాలు -కొద్దిగా
తయారీ విధానం :
ముందుగా ఒక మిక్సీ జార్ లో మిరియాలు, వెల్లూల్లి,  జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి, ధనియాలు  వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె పోయాలి. నూనె కాగిన తరువాత  అందులో ఆవాలు, జిలకర, ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి.తాలింపు అయ్యాక అందులో బాగా పండిన టొమాటో ముక్కలు వేసి టొమాటోలు గుజ్జుగా అయ్యేదాక ఉంచాలి. టమోటోలు మగ్గిన తరువాత అందులో  చింతపండు పులుసు, మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిరియాల పేస్ట్, ఉప్పు,పసుపు, కొద్దిగా కొత్తిమీర, ఇంగువ, సరిపడా నీళ్లు పోసి తక్కువ మంట మీద కాగనివ్వాలి.ఇందులో కారం అనేది మీ ఇష్టం. ఎందుకంటే మిరియాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి కారం వేయడం లేదు. మీకు కారం చాలకపోతే రెండు లేదంటే మూడు ఎండు మిరపకాయలు వేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: