టమాటా -మెంతి కూర కాంబినేషన్ అదరహో....!

Suma Kallamadi
మనం ఏ కూర వండాలన్నా గాని ముందుగా మనకి అవసరమయ్యేవి టమాటాలు. చాలా మంది ప్రతి కూరలోను టమాటలను విరివిగా ఉపయోగిస్తారు. ఒక్క కూరల్లోనే కాకుండా పచ్చళ్లలో కూడా టమాటాలను ఎక్కువగా వాడతారు. టమాటా వేస్తే కూర రుచికరంగా ఉంటుంది.మరి టమాటాలతో మెంతి కూర కాంబినేషన్ ఎప్పుడన్నా వండి చూసారా. చాలా టేస్టీగా బాగుంటుంది. అందుకే ఇండియా హెరాల్డ్ వారు మీ కోసం టొమోటో మెంతి కూర వండడం ఎలానో మీకు వివరించబోతున్నారు. దీని కోసం కావలిసిన పదార్ధాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. !
కావాల్సిన పదార్ధాలు
టమాటాలు 250 గ్రాలు.
చిన్న మెంతి కూర 1 కట్ట
పసుపు 1/4 టీ స్పూన్
ఉల్లి పాయ 1
కరివేపాకు 1 రెబ్బ
అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్
ఉప్పు తగినంత
నూనె 3 టీస్పూన్లు
 తయారు చేయు విధానం:
ముందుగా టమాటాలు శుభ్రంగా కడుక్కుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే మెంతి కూర కూడా  సన్నగా తరిగి నీళ్లలో వేసి రెండు మూడు సార్లు కడగాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి లేదా గిన్నె పెట్టి అందులో  నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడే వరకు వేయించాలి.ఉల్లిపాయ వేగాక అందులో కొద్దిగా  పసుపు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి వేపాలి. అవి కూడా వేగిన తర్వాత మెంతి కూర వేసి వేపాలి. తర్వాత టమాట ముక్కలు కూడా వేయండి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం వేసి ఒకసారి కూర మొత్తం కలిపి మూత పెట్టి నిదానంగా ఉడికించాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత ఉప్పు కారం ఒకసారి చూసుకోండి. కూరలో నూనె పైకి కనిపించినప్పుడు స్టవ్ అఫ్ చేసేయండి.అంతే ఎంతో రుచికరమైన టొమోటో మెంతి కూర రెడీ అయినట్లే. ఈ కూర అన్నంలో కాని చపాతి లో కాని నంచుకుని తింటే చాలా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: