పీతలతో ఇలా ట్రై చేసారా...?

Suma Kallamadi

ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ లేనిదే కొంతమందికి ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదు. అయితే ప్రతిసారి చికెన్ , మటన్, ఫిష్ కాకుండా ఈసారి కొత్తగా పీతల కూర వండి చూడండి. చప్పబడిపోయిన నోటికి ఈ పీతల కూర భలే కొత్త రకం రుచిని ఇస్తుంది. పీతల పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కొంతమంది ఈ పీతల కూర తినడానికి ఇష్టపడరు. కానీ వండే విధంగా వండితే ఈ కూర చాలా రుచికరంగా ఉంటుంది.అందుకే ఆదివారం స్పెషల్ గా ఇండియా హెరాల్డ్ వారు పీతల కూర ఎలా తయారు చేయాలో మీకు వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా పీతల కూర ఎలా చేయాలో చూడండి.
కావాల్సిన పదార్ధాలు:
పీతలు : అరకిలో
టమాటాలు : రెండు
కొబ్బరి ముక్కలు : కప్పు
గసగసాలు : రెండు టీ స్పూన్లు (నానబెట్టాలి )
కారం : రెండు టీ స్పూన్లు
ఉప్పు : సరిపడా
నూనె : కప్పు
కొత్తిమీర : చిన్న కట్ట
మసాలా పొడి  : అర టీ స్పూన్
దనియాలు : టీ స్పూన్
జీలకర్ర : టీ స్పూన్
పచ్చిమిర్చి : మూడు
మిరియాలు : పావు టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
తయారు చేయు విధానం:
ముందుగా పీతలను శుబ్రం చేసి వాటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సి జార్లో నానబెట్టిన గసగసాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ అయ్యేలా మిక్స్ చెయ్యాలి.తరువాత దానిలోనే కారం, ఉప్పు, మిర్చి, కొబ్బరిముక్కలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్తూ, గరంమషాల వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి నూనె వేడి చేయాలి.నూనె కాగాక  కరివేపాకు వేసి వేగాక రుబ్బిన మషాల ముద్ద వేసి గరిటతో కలుపుతూ మంచి వాసనవచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తరువాత ఇప్పుడు ఉడికించిన పీతలు వేసి చిన్న మంట మీద వేయించాలి. చక్కటి వాసన వచ్చే వరకు వేయించి కొత్తిమీర జల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆపేయాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: