పూరీ- ఈ కర్రీ కొంబో అదుర్స్..!

Suma Kallamadi
ప్రతి రోజు ఇడ్లీ, దోస తిని బోర్ కొట్టిందా. అయితే ఈసారి పూరీ ట్రై చేసి చూడండి. మరి పూరీ అయితే చేస్తారు  దానిలోకి కర్రీ ఏంటి అని ఆలోచిస్తున్నారా.పూరీలోకి సరైన కాంబినేషన్ లేకపోతే దాని రుచి సరిగా ఉండదు. అందుకే ఇండియా హెరాల్డ్ వారు మీకోసం పూరీకి పర్ఫెక్ట్ గా సరిపోయే ఒక రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నారు. మరి ఆ కూర ఎలా వండాలో తెలుసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి.
కావలిసిన పదార్ధాలు :
2 tsps నూనె
1/2 tsp ఆవాలు
1 tsp శెనగపప్పు
1 tsp మినపప్పు
1 tsp జీలకర్ర
1 రెబ్బ కరివేపాకు
2 ఎండు మిర్చి
250 gms పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు
2 పచ్చిమిర్చి
ఉడికించిన చిన్న బంగాళ దుంప
1 tsp అల్లం తరుగు
1 tsp నిమ్మరసం
2 tsp శెనగపిండి
1/4 tsp పసుపు
ఉప్పు
నీళ్ళు సరిపడా
కొత్తిమీర -కొద్దిగా
తయారీ విధానం :
ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక బాండీ పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక  అందులో ఆవాలు, శెనగ పప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒక దాని వెంట మరొకటి వేస్తూ ఎర్రగా వేపుకోవాలి.తాలింపు వేగాక అందులో పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ చీలికలు, పసుపు వేసి బాగా వేపుకోండి.తరువాత కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి మూతపెట్టి ఉల్లిపాయ మెత్తబడే దాకా ఉడకనివ్వాలి.ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో శెనగపిండి వేసి గడ్డలు లేకుండా నీళ్ళు పోసుకుంటూ జారుగా కలపాలి. ఇప్పుడు ఈ శెనగపిండి మిశ్రమాన్ని పొయ్యి మీద ఉన్న కూరలో పోసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పోసేటప్పుడు గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇంకా అల్లం తరుగు కూడా వేసి కలుపుకోవాలి.శెనగపిండి కూరలో కలిసిపోయాక, ఒక బంగాళా దుంపను చిన్న చిన్న ముక్కలుగా కోసి కూరలో వేయాలి.2 నిమిషాలు కూర ఉడికాక స్టవ్ ఆపేసి నిమ్మరసం వేసి కలిపి దింపేసుకోవాలి.ఆఖరికి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: