చిక్కుడుతో ఆ రుచే వేరు కదా.. ?

Suma Kallamadi
ఎంతో ఆకలితో ఇంటికి వచ్చిన మీ శ్రీవారు ఈ రోజు కూర ఏమి వండావు అని అడిగితే గోరు చిక్కుడుకాయ అని మీరు అంటే మీ శ్రీవారి ఆకలి కాస్త ఉష్ అంటుంది కదా. ఎందుకంటే గోరు చిక్కుడు కాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు. అయితే ఇండియా హెరాల్డ్ వారు చెప్పే విధంగా మీరు కనుక గోరు చిక్కుడు కాయ ఫ్రై చేస్తే వద్దు అన్నా మీ శ్రీవారే ఎంతో ఇష్టంగా తింటారు .
కావాల్సిన పదార్ధాలు
400 gms గోరు చిక్కుడు కాయలు
1 tsp ఉప్పు
నీళ్ళు – ఉడికించుకోడానికి
7-8 ఎండు మిర్చి
1 tbsp గసగసాలు
ఎండు కొబ్బరి
ధనియాలు -2 టేబుల్ స్పూన్స్
ఉప్పు
వేపుడు కోసం
1/4 cup నూనె
3/4 cup ఉల్లిపాయ తరుగు
3 పచ్చిమిర్చి
ఉప్పు
చిటికెడు పసుపు
1 tsp అల్లం వెల్లులి ముద్ద
చిటికెడు గరం మసాలా
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం :
ముందుగా స్టవ్ ఆన్ చేసి గోరుచిక్కుడు కాయాల్లో నీళ్ళు, ఉప్పు వేసి 80 % ఉడికించి నీళ్ళని ఓంపేసి చల్లరానివ్వాలి.చల్లారిన గోరు చిక్కుడు కాయల తొక్కలు  తీసేసి అంగుళం కన్నా కాస్త పెద్దగా ముక్కలు కోసుకోవాలి.తర్వాత మిక్సీలో గసగసాలు, ఎండు కొబ్బరి,ఎండు మిర్చి, ధనియాల పొడి వేసి మెత్తని పొడి చేసుకోవాలి.ఇప్పుడు ముకుడులో నూనె వేడి చేసి అందులో ఉల్లి పాయ తరుగు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ మెత్తబడే దాక వేపుకోవాలి.తరువాత అందులో అల్లం- వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి.ఇప్పుడు ఈనెలు తీసేసిన గోరుచిక్కుడు ముక్కలు, ఉప్పు, పసుపు వేసి 3-4 నిమిషాల పాటు చిక్కుడు కాయలోని చెమ్మా అంతా పోయేదాకా దాకా వేపుకోవాలి.3-4 నిమిషాల తరువాత గసాల కారం, కొత్తిమీర తరుగు వేసి బాగా పట్టించి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి.అంతే చిక్కుడు కాయ ఫ్రై రెడీ. !




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: