ఆహా అనిపించే సరికొత్త స్వీట్ రెసిపీలు మీకోసం.. !

Suma Kallamadi
తీపి ఇష్టపడే వాళ్ళు ఇండియా హెరాల్డ్ వారు చెప్పే ఈ రెండు రకాల స్వీట్ రెసిపీలను ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో తియ్యగా, రుచికరంగా ఉంటాయి.
 
కొబ్బరి ఉండలు :
కావాల్సిన పదార్ధాలు:
2 cup పచ్చి కొబ్బరి
1 cup బెల్లం
3 - 4 spoon నీళ్ళు
1/2 tsp యాలకలపొడి
3 tbsp నెయ్యి
10 జీడిపప్పు
విధానం
ముందుగా పచ్చికొబ్బరి తురుముకుని ఉంచుకోవాలి తరువాత,బెల్లం తరుగు కొద్దిగా నీళ్ళు వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.ముకుడులో నెయ్యి కరిగించి జీడి పప్పు వేసి ఎర్రగా వేపి తీసుకోవాలిఅదే నెయ్యిలో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ దగ్గరపడనివ్వాలి.20 నిమిషాలకి హల్వాలా దగ్గర పడుతుంది. అప్పుడు యాలకల పొడి , మరో tsp నెయ్యి, వేపుకున్న జీడి పప్పు వేసి కలిపి దింపేసుకోవాలి
2)రవ్వ లడ్డులు :
కావాల్సిన పదార్ధాలు
1 cup బొంబాయి రవ్వ (250 gms)
1/2 cup పచ్చి కొబ్బరి తురుము
3 tbsps నెయ్యి (50 gms)
10 - 15 జీడి పప్పు
10 - 15 ఎండు ద్రాక్ష
1 cup పంచదార (175 gms)
100 ml నీళ్ళు
3 - 4 యాలకల పొడి
తయారీ విధానము :
ముందుగా బొంబాయి రవ్వలో పచ్చి కొబ్బరిని కలిపి రెండు గంటలు వదిలేయండి.బాండి లో నెయ్యి వేసి కరిగించి జీడి పప్పు ద్రాక్ష వేసి వేయించి తీసి పక్కనుంచుకోండి.ఇప్పుడు రెండు గంటలు నానబెట్టుకున్న రవ్వ వేసి సన్నని మంట మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చే దాక వేపుకోండి .మరో బాండిలో పంచదార నీళ్ళు పోసి ఓ తీగ పాకం వచ్చేదాకా మరిగించండి.తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న రవ్వ, జీడిపప్పు కిస్మిస్స్ వేసి బాగా కలిపి గోరువెచ్చగా అయ్యేదాకా చల్లారనివ్వండి.గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకుంటే బాగా వస్తాయి. చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: