క్యాప్సికమ్ తో ఈ కాంబినేషన్ ఎప్పుడన్నా ట్రై చేసారా.?

Suma Kallamadi
కాప్సికమ్ తో చేసే ఏ వంట అయిన చాలా రుచికరంగా ఉంటుంది. అలాంటిది క్యాప్సికమ్ కు కోడిగుడ్డును జత చేస్తే దాని టేస్ట్ ఎంత బావుంటుందో మాటల్లో చెప్పలేము. అందుకనే ఈరోజు ఇండియా హెరాల్డ్ వారు క్యాప్సికమ్ తో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో మీకు వివరించబోతున్నారు.
కావలిసిన పదార్ధాలు :
కాప్సికం -1/2 కేజీ (గ్రీన్ అండ్ రెడ్ )
కోడిగుడ్లు -4
ఉల్లిపాయ -1 పెద్దది
పచ్చిమిరపకాయలు -4
ఉప్పు -సరిపడా
కారం -సరిపడా
పసుపు -చిటికెడు
మిరియాల పొడి -1 టీ స్పూన్
నూనె -సరిపడా
ఆవాలు -1/2 టీ స్పూన్
జీలకర్ర -1/2 టీ స్పూన్
కరివేపాకు -కొద్దిగా
తయారీ విధానం :
ముందుగా క్యాప్సికమ్ ముక్కలను చిన్న చిన్నగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు మార్కెట్లో రెడీ క్యాప్సికమ్ దొరికితే దాన్ని కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా రెండు రకాల క్యాప్సికమ్ వాడడం వలన కూర చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. తరువాత ఉల్లిపాయలను బారుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో సరిపడా నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి.ఆవాలు చిటపడ లాడిన తర్వాత పచ్చి మిర్చి,ఉల్లిపాయలు వేసి వేపాలి. అవి వేగాక సన్నగా కోసుకున్న కాప్సికం ముక్కలు కూడా వేసి వేపాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కోడిగుడ్లు కొట్టాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా బీట్ చేయాలి. క్యాప్సికమ్ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. అందుకనే క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా వేగితే చాలు. ఇప్పుడు వేగిన క్యాప్సికమ్ ముక్కలలో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేయాలి. ఒక రెండు నిముషాలు అయ్యాక బీట్ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పోయాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి తిప్పి మూత పెట్టేయండి. ఒక ఐదు నిముషాలు అయ్యాక మళ్ళీ ఒకసారి కలపండి. నూనె పైకి కనిపించే అంతా వరకు వేపండి. తరువాత కొద్దిగా మిరియాల పొడి చల్లి స్టవ్ ఆపేయండి.అంతే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెడీ అయినట్లే. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: