కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

Divya

మష్రూమ్స్.. వీటినే మనం పుట్టగొడుగులు అని కూడా అంటాము. మష్రూమ్ వానజల్లులు పడి, ఆగిన తర్వాత గొడుగు లాగ భూమిలో నుంచి పొడుచుకువస్తాయి. అయితే వీటిలో కూడా కొన్ని హానికరమైన మష్రూమ్స్ ఉంటాయి. ఇలా తీసుకునేటప్పుడు పరిశీలించి తీసుకోవడం మరీ ఉత్తమం. ప్రస్తుతం ఈ మధ్య మార్కెట్లో కూడా లభ్యమవుతున్నాయి. ఎవరైతే మాంసాహారం తినడానికి ఇష్టపడరో అలాంటి వారు ముఖ్యంగా శాఖాహారులకు  ఇవి చాలా పోషకాలను అందిస్తాయి. ఈ మష్రూమ్స్ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు యవ్వనంగా కూడా ఉంటుంది. ముడతలు దరిచేరవు. అంతేకాకుండా మెదడు యొక్క పనితీరు మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. అయితే ఇంతటి ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ  మష్రూమ్స్ తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు - అర కిలో,
టొమాటో         - ఒకటి ( చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ).
కరివేపాకు రెండు-  రెబ్బలు,
తెల్ల ఉల్లిపాయ - పది రెబ్బలు,
ఉల్లిపాయ  - 1 ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
లవంగం - 5,
చెక్క - 2,
అల్లం- ఒక ఇంచ్, పోపు గింజలు,  పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కారం - రెండు టేబుల్ స్పూన్లు, పచ్చికొబ్బరి -1/2, జీడిపప్పు -  పది ముక్కలు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా..
తయారీ విధానం :
ముందుగా ఈ కూరకు కావలసిన జీడిపప్పు పేస్ట్ తయారు చేసుకుందాం.. ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో కొబ్బెర, జీడిపప్పు, చెక్క లవంగం, తెల్ల ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం అన్నీ వేసి ఫైన్ పేస్టు లాగా తయారు చేసుకోవాలి.

ఇక ఇప్పుడు ఒక బాణలి తీసుకొని, స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసి,బాగా కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులను అందులో వేయాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలియబెట్టాలి. ఒక పది ఐదు నిమిషాల తర్వాత నీరు బయటకు వచ్చి, ఇమిడిపోయిన తర్వాత దించేయాలి. ఇప్పుడు మరొక బాణలి పెట్టి, అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ, టమోటా ముక్కలు,కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు గోధుమరంగులోకి వచ్చేటప్పుడు కొద్దిగా పసుపు వేసి మరొకసారి వేగనివ్వాలి. ఇక ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత, అందులో తయారుచేసి పెట్టుకున్న  జీడిపప్పు పేస్ట్ వేయాలి. ఇది బాగా మగ్గిన తర్వాత పైన నూనె తేలాలి. ఇక్స్ వేయించి పెట్టుకొన్న మష్రూమ్  ఇందులో వేసి, కొద్దిగా నీరు వేసి పైన మూత పెట్టాలి. కొంత సమయం తర్వాత బాణాలి పైన మూత తీసి మరొకసారి కలియబెట్టి దించేస్తే సరిపోతుంది. గుమగుమలాడే మష్రూమ్ కర్రీ రెడీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: