ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

Suma Kallamadi
చాలామందికి టీ తాగనిదే అసలు రోజు గడవదు. టీ తగిన తర్వాతనే ఏ పని అయినాగానీ మొదలుపెడతారు. అయితే ఈసారి కాస్త వెరైటీగా ఇండియా హెరాల్డ్ వారు చెప్పే ఈ టీ లను రుచి చూడండి. మీరు బ్లాక్ టీ, నారింజ టీ ల గురించి వినే ఉంటారు. బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది నోటి ఆరోగ్యాన్ని కాపాడటమే కాక క్రానిక్ డిసీస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. బ్లాక్‌ టీ తాగేవారికి ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.నిజం చెప్పాలంటే పాలతో తయారుచేసిన టీతో పోల్చితే.. బ్లాక్ టీ (black tea) చాలా బెటర్.అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా బ్లాక్ టీ ఎలా తయారు చేయాలో చూద్దామా.. !!
.
కావలిసిన పదార్ధాలు
1) నీళ్లు -2 కప్పులు
2) టీ పొడి - 1 స్పూన్
3) పంచదార లేదా తేనె -1 టేబుల్ స్పూన్
4)నిమ్మ చెక్క -1
తయారీ విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు, టీ పొడి వేసి బాగా మరిగించాలి. రెండు కప్పుల నీళ్లు కాస్త ఒక కప్పు అయ్యేంత వరకు మరిగించాలి. డికాషన్ నల్లగా అయ్యాక కావాలనుకుంటే పంచదార వేయాలి  తరువాత స్టవ్ ఆపేసి ఒక కప్పులో బ్లాక్ టీ ను వడకొట్టుకోవాలి. పంచదార వద్దు అనుకున్నవాళ్ళు తేనె వేసుకోవాలి.కావాలనుకుంటే నిమ్మరసం కూడా కలుపుకుని తాగవచ్చు.
నారింజ టీ :
కావలిసిన పదార్ధాలు :
సగం నారింజ పండ్ల చర్మం
ఒకటిన్నర కప్పుల నీరు
1/2 అంగుళాల దాల్చినచెక్క
2-3 లవంగాలు 1-2
ఆకుపచ్చ ఏలకులు
1/2 టీస్పూన్ జామ్ లేదా తేనె
తయారీ విధానం :
ఒక గిన్నెలో నీరు పోసి  మీడియం ఫ్లేమ్  మీద ఉంచండి. ఇప్పుడు ముక్కలు చేసిన నారింజ పై తొక్క మరియు ఇతర సుగంధ ద్రవ్యాలు(యాలకలు లేదా లవంగాలు దాల్చిన చెక్క లేదా అల్లం) జోడించండి. ఇది 2-3 నిమిషాలు ఉడకనివ్వండి, తరువాత స్టౌ ఆపివేయండి. టీని ఒక కప్పులో వడకట్టి రుచికి జామ్ లేదా తేనె ను జోడించండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: