ఇలా కాకరకాయ ఫ్రై ఎప్పుడన్నా ట్రై చేసారా.?

Suma Kallamadi
చాలామందికి కాకరకాయ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే కాకరకాయ తినడానికి చాలా చేదుగా ఉంటుంది కాబట్టి. అయితే ఇండియా హెరాల్డ్ వారు చెప్పే ఈ కాకరకాయ ఫ్రై ని ఒకసారి ట్రై చేసి చూడండి.చాలా బాగుంటుంది.  కాకరకాయలను ఉడకపెట్టి చేసే వేపుడు కూర వలన అసలు చేదు అనేది మీకు అనిపించదు.  ఈ కూర వారం పదిరోజుల వరకు నిలవ ఉంటుంది.చిన్న చిన్న కాకరకాయలైతే కాయ కాయ వేయించుకోవచ్చు.లేదా మీకు కావాల్సిన సైజ్ లో ముక్కలు కోసుకోండి.
తయారీ విధానం :
కాకరకాయలు -1/2కేజీ
ఉల్లిపాయలు-1కేజీ
ఉప్పు, కారం- రుచికిసరిపడ
పసుపు- 1/2స్పూన్
వెల్లుల్లి రెబ్బలు-10
కరివేపాకు-4రెమ్మలు
జీలకర్ర - 2స్పూన్
పచ్చిశెనగపప్పు -1స్పూన్
మినపప్పు- 1స్పూన్
ఆవాలు- 1/2స్పూన్
నూనె- 50గ్రాములు
పెరుగు- 4స్పూన్స్
చింతపండు- కొంచం

ఎండు కొబ్బరి -కొంచెం 
 
తయారీ విధానం :
ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడగాలి.  చిన్న కాయలైతే ఒక గాటు పెట్టండి.లేదా పెద్దకాయలైతే మీకు కావలసిన సైజ్ లో ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, కొంచం నీళ్ళు, ఉప్పు, చింతపండు, కొంచం పసుపు వేసి బాగా కలిపి ఒక పదినిమిషాలు నానాక చింతపండుని పిండి పిప్పి తీసేసి ఆ గిన్నెలో కోసిన కాకరకాయ ముక్కలు వేసి కలిపి స్టౌ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన కాకరకాయ ముక్కలను వడకట్టుకుని గట్టిగా పిండి ఒక ప్లేట్ లో పరిచి ఎండలో పెట్టి ఒక 6గంటలు ఎండనివ్వాలి. ముక్కలు ఎండాక స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి ఎండిన కాకరకాయ  ముక్కలను వేసి బాగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఒక బాండీ పెట్టి నూనె పోసి పోపు దినుసులు వేయాలి. తాలింపు వేగాక అందులో కొంచం కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు వేసి కలిపి బాగా వేయించుకోవాలి.ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి ఎర్రగా వచ్చాక అందులో వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసి కలపాలి.అవి వేగుతుండగా ఈలోపు మీరు ఒక మిక్సీ జార్ లో రుచికిసరిపడా ఉప్పు, జీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, వేసి బాగా మిక్సీ పట్టుకోండి.ఇప్పుడు ఈ పొడిని వేగుతున్న కాకరకాయలలో వేసి కలిపి మూత పెట్టి బాగా వేయించుకోవాలి.ఒక 5నిమిషాల తరవాత అందులో రుచికిసరిపడ కారం వేసి కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాలు వేయించుకుని దించాలి.అంతే కాకరకాయ ఫ్రై రెడీ అయినట్లే. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: