చికెన్ కర్రీని ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా...?

Suma Kallamadi
వీకెండ్ వస్తే అందరు నాన్ వెజ్ కోసం కోసం ఎదురు చూస్తారు.ఏమి కూర వండుకుందామా అని ఆలోచనలో పడతారు. కానీ ఎప్పుడు ఒకేలాంటి నాన్ వెజ్ కర్రీ తిని తిని విసిగిపోయిన వాళ్ళకి ఇండియా హెరాల్డ్ వారు చెప్పే టొమోటో చికెన్ స్పెషల్ నాన్ వెజ్ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే ఈ చికెన్ కర్రీ చేయడం కూడా చాలా తేలిక. అట్టు, చపాతీ, పూరీ లేదా వేడి వేడి అన్నం లోకి చాలా బాగుంటుంది.మరి ఆలస్యం చేయకుండా టొమోటో చికెన్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దామా. !
కావాల్సిన పదార్ధాలు:
500 gms చికెన్
1/2 kilo నాటు టమాటోలు
150 gms ఉల్లిపాయ తరుగు
3 పచ్చిమిర్చి చీలికలు
2 రెమ్మలు  కరివేపాకు
2 tsp కొత్తిమీర తరుగు
1/2 tsp ఆవాలు
1/2 tsp జీలకర్ర
2 -3 ఎండు మిర్చి
ఉప్పు
1/2 tsp పసుపు
2 tsp కారం
1 tsp గరం మసాలా
1.25 tbsp అల్లం వెల్లులి పేస్ట్
1/3 cup నూనె
తయారీ విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి  2 పండిన టమాటో ముక్కలు వేసి 3 నిమిషాలు ఫ్రై చేసి తీసి పక్కనుంచుకోండి.అదే నూనె లో ఆవాలు,  జీలకర్ర,  ఎండుమిర్చి వేసి వేపుకోండి. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే అప్పుడు అల్లం,  వెల్లూలి పేస్టు కూడా వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇప్పుడు మిగిలిన టొమాటో ముక్కలను వేసి, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఈ కూరకి సరిపడా నూనె ఉంటేనే రుచికరంగా ఉంటుంది. ఇలా టొమోటో ముక్కలు వేగడానికి  కాస్త టైం పడుతుంది.
టమాటో గుజ్జు బాగా మగ్గి దగ్గర పడ్డాక అప్పుడు పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి బాగా కలుపుకోండి.తరువాత చికెన్ వేసి బాగా కలుపుకుని 4 నిమిషాల పాటు హై ఫ్లేం మీద ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కల్లోంచి నీరు ఇగిరిపోయి నూనె పైకి తేలాలి. అప్పుడు పావు లీటర్ నీళ్ళు పోసి మీడియం- ఫ్లేం మీద కూర దగ్గర పడేదాకా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి.
కూర సగం పైన మగ్గాక అప్పుడు మొదటగా ఫ్రై చేసి పక్కనున్చుకున్న టమాటో ముక్కలు, కరివేపాకు వేసి కూరలోంచి నూనె పైకి తేలేదాకా లో-ఫ్లేం మీద కుక్ చేసుకోండి.నూనె పైకి తేలాక కొత్తిమీర చల్లుకుని దించేయాలి. !


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: