ఈ చపాతీలను ఎప్పుడన్నా టేస్ట్ చేసారా.?
రాగి పిండి: రాగి పిండి గురించి అందరికి తెలిసే ఉంటుంది. చాలామంది రాగి పిండితో రాగి జావా చేసుకుని మజ్జిగలో కానీ పాలలో గాని కలుపుకుని తాగుతారు.రాగి పిండిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ లాంటి పోషకాలు ఉన్నాయి. రాగిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకసారి రాగిపిండితో రోటీస్ చేసుకుని తినండి. రాగితో చేసిన రోటిస్ సులభంగా జీర్ణమవుతాయి.అలాగే బరువు కూడా ఈజీగా తగ్గుతారు.
బాదం పిండి: బాదం పప్పు గురించి మీరు వినే ఉంటారు. బాదం పోషకాహారానికి గొప్ప మూలం. బాదం పిండితో చేసిన రోటిస్ తినడం చాలా మంచిది. బాదంపప్పులో తక్కువ ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. అది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.
బజ్రా పిండి: మీరు ఫైబర్ అధికంగా ఉండే చపాతీ కోసం చూస్తున్నట్లయితే, మీ ఆహారంలో బజ్రా రోటిస్ యాడ్ చేయండి. బజ్రా పిండి చపాతీలలో మెగ్నీషియం, ఇతర ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.బరువు కూడా సులభంగా తగ్గుతారు.
జోవర్ పిండి: సాధారణంగా మనం తినే గోధుమ చపాతీల కంటే జోవర్ పిండితో చేసిన చపాతీలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా ఈ పిండితో చేసిన చపాతీలు సులభంగా జీర్ణం అవుతాయి. జోవర్ జీర్ణక్రియను మరింత పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉండడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
వోట్ పిండి(Oat Flour): బరువు తగ్గాలని భావించే వారికి వోట్ పిండి ఒక అద్భుతమైన ఆహార పదార్ధం అని చెప్పవచ్చు.ఇందులో ఎక్కువగా బి-విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. పైన మేము చెప్పిన పిండి పదర్ధాలతో చపాతీలు చేసుకుని తినండి. బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.