ఈజీగా చేసుకునే వంటకాలు ఇవే. !

Suma Kallamadi
ప్రతిరోజు ఒకేలాంటి వంటలు కాకుండా ఈసారి కొత్తగా మేము చెప్పే ఈ రెసిపీలను ట్రై చేయండి. చాలా తక్కువ సమయంలో రుచికరమైన వంటకాలు ఇట్టే తయారు చేసుకోవచ్చు.
పన్నీర్ 65:
కావలసిన పదార్ధాలు :పనీర్‌ ముక్కలు - 15, ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - అర టీస్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు, మైదా - ఒక టీస్పూను, కార్న్‌ ఫ్లోర్‌ - ఒక టీ స్పూను, అల్లం పేస్టు - ఒక టీస్పూను, కారం - సరిపడినంత, పసుపు - అర టీ స్పూను, గరం మసాలా - టీస్పూను, నూనె - సరిపడినంత
తయారీ విధానం : ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్‌ మీద కళాయి పెట్టి  వేయించడానికి సరిపడా నూనె పోయాలి.మరొక గిన్నెలో పన్నీర్‌ ముక్కలు, కార్న్‌ ఫ్లోర్, మైదా, అల్లం పేస్టు,  తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.తరువాత కాగుతున్న నూనెలో పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి బాగా వేపాలి. మరో బర్నర్‌ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు బాగా వేగిన పనీర్‌ ముక్కల్ని తీసి వీటిలో వేసి బాగా కలపాలి. అంతే పనీర్‌ 65 సిద్ధం.
పాలక్ పరోటా :పాలకూరతో చేసిన రెసిపీలు ఎంత రుచికరంగా ఉంటాయో మన అందరికి తెలిసిందే. అలాగే పాలకూర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది.పాలకూరతో పరోటాలను ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి.
కావలసినవి: గోధుమపిండి, మైదాపిండి - 1 కప్పు చొప్పున, పాలకూర - 1 కట్ట, నిమ్మరసం - 1 టీ స్పూన్‌, పచ్చిమిర్చి ముక్కలు - 1 టీ స్పూన్‌, అల్లం పేస్ట్‌ - 1 టీ స్పూన్‌, ఉప్పు - తగినంత, నీళ్లు - కావాల్సినన్ని, నూనె/నెయ్యి - సరిపడా
తయారీ విధానం :  ముందుగా పాలకూరని శుభ్రంగా నీటిలో కడుక్కుని మిక్సీ బౌల్‌లో వేసుకుని, అందులో నిమ్మరసం, 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు వేసుకుని మెత్తని  పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్‌ తీసుకుని  అందులో గోధుమపిండి, మైదాపిండి, అల్లం పేస్ట్, పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుని చపాతి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు నానా నివ్వాలి. ఆ తర్వాత  మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్‌ ఉండలులా చేసుకుని,  చపాతీ కర్రతో ఒత్తుకుని మరోసారి మడిచి మళ్లీ చపాతీలా ఒత్తి పెనంపై నెయ్యి లేదా నూనెతో ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి.అంతే పాలకూర పరోటాలు రెడీ అయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: