టేస్టీ గుత్తి వంకాయ కుర్మా కర్రీ.. !

Suma Kallamadi
గుత్తి వంకాయ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. తాజా కూరల్లో గుత్తి వంకాయకు ఉన్న స్పెషల్ మరే కూరగాయకు ఉండదు.లేత వంకాయలను చక్కగా నూనెలో వేపి ఉప్పు,  కారం పట్టించి అలా నోట్లో వేసుకుంటే ఆ రుచే వేరు కదా.ఈ గుత్తి వంకాయ కుర్మా కర్రీ రొటీలు, చపాతీ, పూరీతో లేదా అన్నంలో తిన్నాగాని ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కర్రీ ఎలా వండాలో చూద్దామా. !
కావాల్సిన పదార్ధాలు :
6 గుత్తి వంకాయలు
400 ml నీళ్ళు
ఉప్పు
కొత్తిమీర – కొద్దిగా
2 tbsp నెయ్యి
2 tbsp నూనె
1 బిర్యానీ ఆకు
4 యాలకలు
4 లవంగాలు
2 inches దాల్చిన చెక్క
1/2 tsp జీలకర్ర
1/2 tsp కారం
1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
1/2 tsp మిరియాల పొడి
1 tbsp బటర్
మసాలా పేస్ట్
1 cup వేపిన ఉల్లిపాయలు
10 - 15 జీడిపప్పు
4 - 5 పచ్చిమిర్చి
తయారీ విధానం:
ముందుగా వంకాయలని మధ్యకి కోసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి ఆ నూనెలో 60% వరకు వంకాయలను వేపి తీసుకోవాలి.ఇప్పుడు అదే నూనెలో సన్నగా, బారుగా కోసిన ఉల్లిపాయలను ఎర్రగా వేపి తీసేయాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేపిన ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.తరువాత పాన్లో నెయ్యి నూనె వేడి చేసి చెక్కా, లవంగాలు, యాలకలు, షాహీ జీరా , బిర్యానీ ఆకు అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోవాలి. తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోవాలి.ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి. నూనె పైకి తేలాక వేపిన వంకాయలు అందులో వేసి వేడి నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక మూతపెట్టి ఉడికించుకోవాలి.నూనె పైకి తేలేక మిరియాలపొడి, బటర్, క్రీమ్ వేసి బాగా కలిపి దింపేసుకోండి.తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి.ఈ కూర కూర వేడి అన్నంలో, చపాతీ, పుల్కాలలోకి చాలా రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: